Allu Arjun: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా నిర్మాతగా పేరు సొంతం చేసుకున్న అల్లు అరవింద్ (Allu Aravindh) వారసుడిగా.. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్(Allu Arjun) ‘గంగోత్రి’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. మొదటి సినిమాతోనే తన నటనలోని టాలెంట్ నిరూపించుకున్న బన్నీ.. ఆ తర్వాత పలు చిత్రాలు చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇకపోతే వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన అల్లు అర్జున్.. పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా సెలబ్రిటీ అయిపోయారు. అంతేకాదు గత ఏడాది డిసెంబర్ 5వ తేదీన అల్లు అర్జున్ దర్శకత్వంలో పుష్ప సీక్వెల్ గా వచ్చిన ‘పుష్ప 2’ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడమే కాకుండా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండవ చిత్రంగా నిలిచింది. ఫుల్ రన్ ముగిసేసరికి రూ.1850 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా ఒక నార్త్ ఇండియా లోనే రూ.800 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోస్ కి కూడా ప్రాంతీయంగా అక్కడ ఇంత కలెక్షన్ రాలేదనే వార్తలు కూడా వినిపించాయి.
అబూదాబిలో నారాయణ్ మందిరాన్ని సందర్శించిన అల్లు అర్జున్..
ఇకపోతే ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలవల్ల బ్రేక్ ఇచ్చిన ఈయన.. ప్రస్తుతం అబూదాబీలో అత్యంత సుందరంగా రూపొందిస్తున్న స్వామి నారాయణ్ మందిరాన్ని సందర్శించారు. ఇక అక్కడ ఆలయ నిర్మాణాన్ని దగ్గరుండి మరీ తిలకించిన అల్లు అర్జున్.. ఆలయం యొక్క విశిష్టతను, ప్రత్యేకతలను అక్కడి ఆలయ ప్రతినిధుల ద్వారా తెలుసుకున్నారు. ముఖ్యంగా అక్కడ ఎంతో సుందరంగా రూపొందించిన ఆ ఆలయ నిర్మాణం చూసి అల్లు అర్జున్ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అంతేకాదు అల్లు అర్జున్ ని ఇలా ఎప్పుడూ చూడలేదని అభిమానులు కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా దుబాయ్ అబూదాబి లో హిందూ సాంప్రదాయానికి ప్రతీకగా , ఇంతటి గొప్ప ఆలయాలు నిర్మితమవుతుండడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పుష్ప 2 సినిమాతో చిక్కుల్లో పడ్డ అల్లు అర్జున్..
ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే.. పుష్ప2 సినిమాతో ఎంత క్రేజ్ అయితే సొంతం చేసుకున్నారో.. ఆ సినిమా తీసుకొచ్చిన ఇబ్బందుల వల్ల అన్నే సమస్యలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా గత ఏడాది డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న సంధ్యా థియేటర్లో బెనిఫిట్ షో వేయగా.. ఈ షో చూడడానికి ర్యాలీ నిర్వహించుకుంటూ బన్నీ వెళ్లారు. అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో బన్నీ అభిమాని రేవతి అక్కడికక్కడే మరణించగా.. ఆమె కొడుకు శ్రీ తేజ్ ఇప్పటికే ప్రాణాలతో పోరాడుతున్నారు.. ఇక ఇదిలా ఉండగా ఇదే కేసు పై జైలుకు వెళ్లిన అల్లు అర్జున్ ఒకరోజు జైలు జీవితం కూడా గడిపి వచ్చారు. ఇక ఇప్పుడు కాస్త ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్ కి వెళ్తున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఒంటరిగానే అబుదాబిలోని నారాయణ్ మందిరాన్ని సందర్శించారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అబుదాబిలో ఐకాన్ స్టార్..
స్వామి నారాయణ్ మందిర్ ను సందర్శించిన అల్లు అర్జున్
ఆలయ నిర్మాణాలను ఆసక్తిగా తిలకించిన బన్నీ
ఆలయ విశిష్టతను అల్లు అర్జున్ కు వివరించిన ఆలయ ప్రతినిధులు pic.twitter.com/DMt7iTVm4F
— BIG TV Breaking News (@bigtvtelugu) March 23, 2025