BigTV English

Pushpa 2: ‘పుష్ప 2’ మిస్ అవ్వకుండా చూడటానికి గల 7 కారణాలు..!

Pushpa 2: ‘పుష్ప 2’ మిస్ అవ్వకుండా చూడటానికి గల 7 కారణాలు..!

Pushpa 2: పుష్ప 2.. ఈ మూవీ కోసం తెలుగు రాష్ట్రాల సినీ అభిమానులతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన పుష్ప మూవీ సీక్వెల్ గా పుష్ప 2 ది రూల్ రాబోతుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 5న ఈ చిత్రం విడుదల కాబోతోంది.. అంతకన్నా ఒక్కరోజు ముందుగా ప్రీమియర్స్ పడనున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. మొదటి భాగంగా సూపర్ హిట్ అవ్వడంతో.. దీనిపై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే టికెట్ రేట్లు భారీగా పెంచేయడంతో సామాన్యులకు భారంగా మారిందని వార్తలు నెట్టింట ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ మూవీని థియేటర్లలో చూడటానికి గల 7 కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


అల్లు అర్జున్ నటన..

అల్లు అర్జున్ గతంలో ఎక్కువగా లవ్ ఎంటర్టైనర్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. అంతేకాదు కొన్ని యాక్షన్ సినిమాలను చేసాడు. కానీ పుష్ప లాంటి ఊరమాస్ లుక్ లో ఎప్పుడు కనిపించలేదు. ఈ సినిమాతో నేను కూడా మాస్ చిత్రాలను చెయ్యగలను అని ప్రూవ్ చేసాడు.ఈ సినిమాతో నేషనల్ వైడ్ గా అల్లు అర్జున్ నటనకు ఫిదా అయ్యారు. ‘పుష్ప’ తో అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకున్న మొదటి టాలీవుడ్ హీరోగా చరిత్ర సృష్టించాడు. ఆ సినిమాలో పుష్పరాజ్ గా అల్లు అర్జున్ నటన నిజంగానే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.మేకోవర్ మార్చుకుని.. ఎండనకా, వాననకా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. మూడేళ్ల తర్వాత అల్లు అర్జున్ నుంచి రాబోతున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.


సుకుమార్ డైరెక్షన్.. 

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ సినిమాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ‘పుష్ప’ తో పాన్ ఇండియా హిట్ కొట్టి చూపించాడు సుకుమార్. మొదటి పార్ట్ లో చాలా చిక్కుముడులు వేశాడు.. ఒక క్యారక్టర్ తో మరొకరిని లింక్ చేసాడు. వాటికి రెండో పార్ట్ లో క్లారిటీ ఇవ్వనున్నాడు. అందుకే ఈ మూవీని ఖచ్చితంగా చూడాలి..

శ్రీవల్లిని ఎవరు చంపుతారు..? 

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమాలో సూపర్ గా ఉంది.. ఎప్పుడు గ్లామర్ గా కనిపించే ఈ అమ్మడు ఈ మూవీలో చాలా న్యాచురల్ గా కనిపించింది. పెళ్ళాం మాట మొగుడు వింటే ఎలా ఉంటాదో ప్రపంచం మొత్తం తెలిసేలా చేస్తాను అనే ఒక్క డైలాగ్ తో ఈ మూవీలో కనిపిస్తుంది. నిన్న రిలీజ్ అయ్యిన పీలింగ్స్ సాంగ్ తో ఈమె గ్లామర్ కూడా హైలెట్ అయ్యేలా ఉంది. అయితే సెకండ్ పార్ట్ లో శ్రీవల్లి పాత్ర చనిపోతుంది అని మొదటి నుండి గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి అది నిజమో.. కాదో? సినిమా చూస్తేనే తెలుస్తుంది.

గంగమ్మ తల్లి జాతర ఎపిసోడ్..

పుష్ప 2 కు గంగమ్మ జాతర సీన్ హైలెట్ కానుందని సినిమా మొదలైనప్పటి నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలో 15 నిమిషాలు ఉండే ఈ సీక్వెన్స్ ని రెండు నెలల పాటు చిత్రీకరించారట. కేవలం ఈ సీక్వెన్స్ కోసం రూ.70 కోట్లు ఖర్చు పెట్టారట. మాస్ ఆడియన్స్ కి గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఈ సీక్వెన్స్ ఉంటుంది మరి సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి..

దేవీ శ్రీ మ్యూజిక్.. 

టాలీవుడ్ యంగ్ టాలెంట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే.. పుష్ప 2’ కి హైప్ పెరిగింది మొదటి గ్లింప్స్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మామూలుగా ఉండదు. అయితే సినిమాకి బ్యాక్ గ్రౌండ్ అందించే బాధ్యతని తమన్ , అజనీష్ లోకనాథ్, సామ్ సిఎస్ ..లకు అందించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దేవీ అందించిన సాంగ్స్ మాత్రం హైలెట్ అయ్యాయి. యూట్యూబ్ లో రికార్డు లను సొంతం చేసుకున్నాయి. మరి దేవికి క్రెడిట్ దక్కిందో లేదో తెలియాల్సి ఉంది..

ఐదుగురు విలన్లు.. 

పుష్ప సినిమాతో పోలిస్తే పార్ట్ 2 లో ఐదుగురు విలన్లు అని ప్రచారం జరుగుతుంది. మరి ఐదుగురితో పుష్ప రాజ్ ఒక్కడే ఎలా ఫైట్ చేసాడు అనే అంశం ఆసక్తిగా మారింది. అందుకోసమైన ఈ మూవీని తప్పక చూడాలి..

శ్రీలీల డ్యాన్స్.. 

యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల ఈ మూవీలో ఐటమ్ సాంగ్ చేసింది. కిస్సిక్ అనే సాంగ్ యూత్ ను బాగా ఆకట్టుకుంది. గతంలో వచ్చిన పుష్ప సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ చేసింది. ఈ పార్ట్ 2 శ్రీలీల ఎలా పెర్ఫార్మ్ చేసిందో చూడాలి…

ఈ ఏడు కారణాలు సినిమాను చూసేందుకు జనాలను థియేటర్లకు వచ్చేలా చేస్తున్నాయి. మరో రెండు రోజుల్లో భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×