Bulli Raju:..ఈ ఏడాది సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడ్డ చిత్రాలలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnaam) సినిమా కూడా ఒకటి. ప్రాంతీయ చిత్రంగా విడుదలై ఊహించని విజయాన్ని సొంతం చేసుకొని, 3 రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఇక ఫుల్ రన్ మునిసేసరికి.. దాదాపు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి, వెంకటేష్ (Venkatesh) సినీ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా 2025 జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) హీరోయిన్లుగా నటించగా.. ఈ చిత్రానికి ప్రముఖ టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహించారు. ఇకపోతే ఈ సినిమా ఇంతలా హిట్ అయింది అంటే అందులో వెంకటేష్ కొడుకుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లి రాజు (బుల్లి Raju) కూడా ఒక కారణమని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఈ చిచ్చర పిడుగు నటన చూసిన తర్వాత అంత త్వరగా ఈ బుడ్డోడిని మరిచిపోలేం.
రోజుకు రూ.లక్ష..
వయసుకే చిన్నోడు..కానీ డైలాగ్ డెలివరీ.. కామెడీ టైమింగ్ లో స్టార్ కమెడియన్ ను తీసిపోడు. ఇక ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో అటు బుల్లి రాజు కి అవకాశాలు కూడా వరుసగా క్యూ కడుతున్నాయట. సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ తర్వాత ఇప్పటివరకు 15 వెబ్ సిరీస్ లు, 4సినిమాలలో అవకాశం వచ్చినట్లు సమాచారం. అయితే బుల్లి రాజు మాత్రం దేనికీ కూడా కమిట్ అవడం లేదని సమాచారం. ఒకవేళ కమిట్ అయితే రోజుకు లక్ష రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారట. ఇంత చిన్న వయసులోనే ఆ రేంజ్ డిమాండ్ అంటే మామూలు విషయం కాదు. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఒకరకంగా చెప్పాలి అంటే వెన్నెల కిషోర్ (Vennela Kishore), సత్య (Sathya), సప్తగిరి (Saptagiri ) లాంటి కమెడియన్స్ కూడా ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోలేదేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం బుల్లి రాజుకి ఉన్న డిమాండ్ కారణంగా నిర్మాతలు కూడా అడిగినంత ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఇంత చిన్న వయసులోనే స్టార్ సెలబ్రిటీల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకోవడంపై పలువురు పలు రకాల కామెంట్లు వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.
బుల్లి రాజుని లాక్ చేసిన అనిల్ రావిపూడి..
అనిల్ రావిపూడి సినిమా తోనే లైమ్ లైట్ లోకి వచ్చిన బుల్లి రాజు.. అనిల్ రావిపూడి చెప్పినట్టే వింటున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుతం అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలో బుల్లి రాజు కోసం ఒక మంచి పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇందులో అంజలి (Anjali ) కీ రోల్ పోషిస్తూ ఉండగా.. ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunhal Thakur) హీరోయిన్ గా అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. ఇకపోతే చిత్ర బృందం ఈ విషయాలపై ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. ఈ సినిమాకి సంబంధించిన పలు విషయాలు మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తూ ఉండగా.. రమణ గోగుల(Ramana Gogula) పాటలు పాడబోతున్నట్లు తెలుస్తోంది. జూన్ లేదా జూలై లో చిత్రీకరణ మొదలై, 2026 సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఏదేమైనా సంక్రాంతి పండుగను సెంటిమెంట్ గా పెట్టుకున్న అనిల్ రావిపూడి.. వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. మరి చిరంజీవితో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయిస్తారో చూడాలి.