CCI Fines UFO – QUBE .. ప్రముఖ డిజిటల్ సినిమా డిస్ట్రిబ్యూషన్ అలాగే సినిమా అడ్వర్టైజింగ్ సంస్థ అయిన యూఎఫ్ఓ మూవీస్ పై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) జరిమానా విధించింది. అలాగే వీటి అనుబంధ సంస్థలైన క్యూబ్ సినిమా టెక్నాలజీస్, స్క్రాబిల్ డిజిటల్స్ తో సహా మరో మూడింటికి కలిపి దాదాపు రూ.2.70 కోట్ల జరిమానా విధించడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సడన్ గా వీటిపై ఇంత పెద్ద మొత్తంలో పెనాల్టీ విధించడం వెనుక అసలు ఏం జరిగింది? అంటూ ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు.
గుత్తాధిపత్యధోరణిపై మండిపడ్డ సీసీఐ..
అసలు విషయంలోకి వెళ్తే.. ఈ సంస్థలు అక్రమ వ్యాపార విధానాలను అవలంభిస్తున్నట్లు తాము గుర్తించామని సీసీఐ తెలిపింది. ఇక ఈ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్న థియేటర్ ల నుంచి పోస్ట్ ప్రొడక్షన్ సర్వీసులు, అలాగే సినిమా కంటెంట్ ను అందించే ఇతర పోటీ సంస్థలకి కూడా ఎలాంటి వ్యాపార అవకాశాలు దక్కకుండా.. గుత్తాధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్నట్లు తాము కనుగొన్నామని సీసీఐ స్పష్టం చేసింది. అందుకే ఇకపై ఇలాంటి అనైతిక పద్ధతులను కొనసాగించకుండా ఆదేశాలు జారీ చేస్తూ.. ఈ మొత్తంలో జరిమానా విధించినట్లు కూడా సీసీఐ తెలిపింది.
ALSO READ ; Pawan Kalyan : హరిహర వీరమల్లు మరోసారి వాయిదా… పవన్‌కు షాక్ ఇవ్వబోతున్న అమెజాన్..!
ఇకపై అలాంటివి చేయకూడదు అంటూ సీసీఐ ఆదేశాలు..
ముఖ్యంగా ఈ విషయం థియేటర్ యజమానులకు అలాగే డిజిటల్ సినిమా పరికరాలను అద్దెకు సరఫరా చేసే యూఎఫ్ఓ మూవీస్, క్యూబ్ వంటి సంస్థలకు మధ్య జరిగిన గొడవకు సంబంధించి.. యజమానులతో యూఎఫ్ఓ మూవీస్ అలాగే క్యూబ్ వారి లీజ్ ఒప్పందాలలో కంటెంట్ సరఫరా పై ఆంక్షలు విధించాయని సిసిఐ తన ఉత్తర్వులలో తెలిపింది . ఇది పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెసింగ్ సేవలలో నిమగ్నమైన వ్యక్తులకు అడ్డంకులను సృష్టించింది అని, అదనంగా ఈ కంపెనీలు డిజిటల్ సినిమా ఇనిషియేటివ్ లకు అనువుగా ఉన్న డిజిటల్ సినిమా పరికరాలను కలిగి ఉన్న సినిమా థియేటర్ యజమానులు.. ఇతర వ్యక్తుల ద్వారా అందించకుండా అడ్డుకున్నాయి. అందుకే ఇతర పార్టీల నుండి కంటెంట్ సరఫరా పై ఆంక్షలు విధించే సిటీవోలతో లీజు ఒప్పందాలను తిరిగి నమోదు చేసుకోవద్దని సిసిఐ స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.అంతేకాదు తప్పు చేసిన పార్టీలు 60 రోజుల్లోపు జరిమానా మొత్తాన్ని డిపాజిట్ చేయాలని కూడా సీసీఐ కోరింది. ఇక అందులో భాగంగానే న్యూ ఇయర్ మూవీస్ ఇండియా, స్క్రాబిల్ డిజిటల్స్ పై రూ.1.04 కోట్ల జరిమానా విధించగా క్యూబ్ సినిమా టెక్నాలజీస్ పై రూ.1.66 కోట్ల జరిమానా విధించింది. మరి 60 రోజుల గడువులో జరిమానా చెల్లించాలని, లేనిపక్షంలో తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా సీసీఐ స్పష్టం చేసింది. మరి దీనిపై ఈ సంస్థలు తమ అభిప్రాయాలను ఏ విధంగా తెలియజేస్తారో చూడాలి.