Unwanted Hair: చాలా మందికి చర్మంపై అన్‌వాంటెడ్ హెయిర్ పెరుగుతుంది. దీని వల్ల అసౌకర్యంగా కూడా అనిపిస్తుంది. అందుకే దీన్ని తొలగించాలని అనుకుంటారు. కానీ, ఏం చేసినా ఈ సమస్య నుంచి బయట పడడం కష్టతరంగానే మారుతుంది. అలాంటి సమయంలో కొన్ని సింపుల్ రెమెడీస్‌తో ఈ సమస్య నుంచి బయట పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. సహజపద్ధతిలో వెంట్రుకల కుదుళ్లను బలహీనపరచడం, వెంట్రుకల పెరుగుదల మందగించేలా చేయడానికి ఇవి చిట్కాలు పని చేస్తాయట.
షుగర్ వ్యాక్సింగ్
చక్కెర, నిమ్మకాయ సహజమైన ఎక్స్‌ఫోలియేటింగ్ స్క్రబ్ లాగా పని చేస్తాయట. అంతేకాకుండా ఈ రెండిని కలిపి తయారు చేసిన పేస్ట్ వాక్సింగ్‌కి కూడా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
కావాల్సిన పదార్థాలు:
2 టేబుల్ స్పూన్లు చక్కెర
1 టేబుల్ స్పూన్ నిమ్మరసం
1 టేబుల్ స్పూన్ నీరు
ఒక పాన్‌లో చక్కెర, నిమ్మరసం, నీటిని కలపాలి. ఈ మిశ్రమాన్ని మృదువైన పేస్ట్‌గా మారే వరకు తక్కువ వేడి మీద వేడి చేయాలి. ఆ తర్వాత వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. జుట్టు పెరుగిన దిశలో పేస్ట్‌ను అప్లై చేసి దానిపై ఒక గుడ్డను పెట్టి ఆరిపోయే వరకు ఉంచాలి. వాక్సింగ్ లాగా వెంట్రుకల పెరుగుదలకు వ్యతిరేక దిశలో క్లాత్‌ని లాగేస్తే వెంట్రుకలు తొలగిపోతాయి.
ఇది నేచురల్‌గా చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో సహాయపడుతుందట. క్రమం తప్పకుండా ఉపయోగించినప్పుడు కాలక్రమేణా వెంట్రుకల పెరుగుదలను తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
పసుపు, పాలు పేస్ట్
చర్మంపై ఉన్న అవాంఛిత రోమాలను తొలగించేందుకు పసుపు చాలా హెల్ప్ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. క్రమం దీన్ని తప్పకుండా ఉపయోగిస్తే జుట్టు పెరుగుదలను తగ్గించడంలో సహాయపడుతుందట.
కావాల్సిన పదార్థాలు
1 టేబుల్ స్పూన్ పసుపు పొడి
2 టేబుల్ స్పూన్లు పాలు
ముందుగా పసుపు పొడి, పాలు కలిపి పేస్ట్ లా చేసి పక్కన పెట్టుకోవాలి. అన్‌వాంటెడ్ హెయిర్ ఉన్న ప్రాంతాల్లో దీన్ని అప్లై చేయాలి. 15-20 నిమిషాల పాలు ఆరనివ్వాలి, తర్వాత గోరువెచ్చని నీటితో మెల్లగా స్క్రబ్ చేయాలి.
పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయట. ఇవి జుట్టు కుదుళ్లను బలహీనపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా తరచుగా చేయడం వల్ల పెరుగుదలను తగ్గించడంలో సహాయపడుతుందని అంటున్నారు.
సహజ పద్ధతులు సాధారణంగా వ్యాక్సింగ్ లేదా షేవింగ్ కంటే ఫలితాలను చూపించడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. అందుకే నేచురల్‌గా అవాంఛిత రోమాల నుంచి విముక్తి పొందాలంటే కొంత సమయం వరకు వేచి చూడాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ALSO READ: ఆరోగ్యవంతమైన జుట్టు కోసం ఇలా చేయండి
పెద్ద ప్రాంతంలో దీన్ని ట్రై చేయడానికి ముందు అలెర్జీ ప్రతిచర్యలను చెక్ చేయడానికి చర్మంలోని ఒక చిన్న భాగంలో ఎల్లప్పుడూ ప్యాచ్ టెస్ట్ చేయడం ముఖ్యం.
అన్‌వాంటెడ్ హెయిర్‌ని తొలగించేందుకు పసుపు, చక్కెర వ్యాక్సింగ్ వాడే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. పసుపు వల్ల చర్మం పొడిబారిపోయే అవకాశం ఉందట. అందుకే ఎల్లప్పుడూ మంచి మాయిశ్చరైజర్‌ని వాడాలని డెర్మటాలజిస్ట్‌లు చెబుతున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.