Hari Hara Veera Mallu OTT :పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒకవైపు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరొకవైపు అభిమానులను ఖుషీ చేయడానికి వరుస సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఆయన ఎన్నికలలో పాల్గొనడానికి ముందు మూడు సినిమాలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఓజీ’.. ఇప్పుడు ఈ మూడు చిత్రాలలో హరిహర వీరమల్లు సినిమాపై బజ్ భారీగా ఏర్పడింది. అయితే సినిమాపై హైప్ క్రియేట్ చేశారు కానీ సినిమాను విడుదల చేయకపోవడంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. ముఖ్యంగా ఈ సినిమా 2021 లోనే ప్రారంభమైంది కానీ ఇప్పటివరకు 11 సార్లు వాయిదా పడుతూ.. మే తొమ్మిదవ తేదీన ఇక ఫైనల్ గా విడుదల కాబోతోందని మేకర్స్ ప్రకటించారు.
మళ్లీ వాయిదా పడనున్న హరిహర వీరమల్లు..
దీంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మే 9వ తేదీన సినిమా ఖచ్చితంగా థియేటర్లలోకి వస్తుందని, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత విడుదల కాబోతున్న ఫస్ట్ సినిమా కాబట్టి.. అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు సడన్గా సినిమా విడుదల తేదీ వాయిదా పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కి అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్ 20 రోజులపాటు డేట్స్ ఇస్తే సినిమా పూర్తి చేస్తామని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అటు పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు డేట్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే డేట్స్ ఇచ్చినా.. మే 9న రిలీజ్ అవ్వడం కష్టమే అని, అందుకే మే 30వ తేదీన సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
పవన్ కళ్యాణ్ కు షాక్ ఇవ్వబోతున్న అమెజాన్ ప్రైమ్..
అయితే ఇలాంటి సమయంలో అమెజాన్ ప్రైమ్ పవన్ కళ్యాణ్ కి గట్టి షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఏమైందంటే అమెజాన్ ప్రైమ్ మాత్రం ఇప్పటివరకు చాలా రోజుల నుంచి ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలోనే “మే 9న రిలీజ్ చేయండి. లేకపోతే ఓటీటీ డీల్ ను క్యాన్సిల్ చేసుకుంటాము ‘ అని చెప్పిందట. ఇక దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ కి ఈ విషయం అతిపెద్ద భారీ షాక్ అని చెప్పవచ్చు. అసలే మే 9న రిలీజ్ అవుతుందని ఎంతగానో ఎదురు చూసిన అభిమానులకు చిత్ర బృందం ఎలా అయితే షాక్ ఇచ్చిందో.. ఇప్పుడు అనుకున్న టైం కి రిలీజ్ చేయాలి అని.. అలా కాని పక్షంలో ఓటీటీ డీల్ క్యాన్సిల్ చేస్తామని టీం కి అమెజాన్ ప్రైమ్ భారీ షాక్ ఇచ్చింది. మరి చిత్ర బృందం ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక సినిమా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా రాబోతున్న ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. బాబీ డియోల్, అనుపమ కేర్ , అర్జున్ రాంపాల్ కీలకపాత్రలు పోషిస్తూ ఉండగా.. ఏఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.