BigTV English

Celebrities on Krishna Death News : సూపర్‌స్టార్ బిరుదుకు సార్ధకత చేకూర్చిన నటుడు కృష్ణ మాత్రమే : పవన్ కళ్యాణ్

Celebrities on Krishna Death News : సూపర్‌స్టార్ బిరుదుకు సార్ధకత చేకూర్చిన నటుడు కృష్ణ మాత్రమే : పవన్ కళ్యాణ్

Celebrities on Krishna Death News : సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. కృష్ణ మృతి వార్త తెలుసుకున్న సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. సినీ రంగంలో నూతన ఒరవడులను ప్రవేశపెట్టిన ఘనత సూపర్‌స్టార్ కృష్ణదేనని గుర్తుచేశారు కేసీఆర్. కృష్ణ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


కృష్ణ నటించిన సినిమాలు యువశక్తికి చిహ్నంగా ఉండేవన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. తెలుగు తెరపై కృష్ణ ఆయన స్పూర్తి ఎల్లవేలలా ఉంటుందని అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రఘాడ సానుభూతి తెలిపారు వెంకయ్యనాయుడు.

కృష్ణ చనిపోయాడని నేనింకా నమ్మలేకపోతున్నానని ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు సోషల్ మీడియాలో స్పందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని..కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.


కృష్ణ మృతి పట్ల ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణ మరణం తెలుగుసినీరంగానికి తీరని లోటు అన్నారు. కృష్ణ కుటుంబసభ్యులకు దేవుడు మనోధైర్యం కల్పించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆంధ్రా జేమ్స్‌బాండ్‌గా కృష్ణ పాపులారిటీ సాధించారని సీఎం గుర్తుచేశారు.

సూపర్‌స్టార్ బిరుదుకు సార్ధకత చేకూర్చిన నటుడు కృష్ణ మాత్రమేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కృష్ణ మరణం తనకు ఎంతో ఆవేదన కలిగించిందన్నారు. ఆయన కోలుకుంటారనుకున్నా గానీ ఈ విషాద వార్త వినాల్సి వచ్చిందని బాధను వ్యక్తం చేశారు. ఆయన కుమారుడు మహేశ్ బాబుకి, ఇతర కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు సోషల్ మీడియాలో తెలిపారు పవన్ కళ్యాణ్.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×