BigTV English

Pahalgam Terror Attack: గుండె బద్దలైంది.. పహల్గామ్ దాడిపై సెలబ్రిటీస్ స్పందన..!

Pahalgam Terror Attack: గుండె బద్దలైంది.. పహల్గామ్ దాడిపై సెలబ్రిటీస్ స్పందన..!

Pahalgam Terror Attack : జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడితో భారత్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉగ్రవాదులు ఈ ఘటనలో చెలరేగిపోయారు. అనంత్ నాగ్ జిల్లా పహల్గామ్ పర్యాటకులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. మినీ స్విట్జర్ల్యాండ్ గా పేరుపొందిన బైసరన్ ప్రాంతంలో.. వేసవి సెలవులు కావడంతో విహారానికి వచ్చిన వారిపై అత్యంత క్రూరంగా దాడి చేశారు. నిన్న అనగా మంగళవారం మధ్యాహ్నం 3:00 ప్రాంతంలో బైసరన్ ప్రాంతంలో ఉన్న దాదాపు 40 మంది పర్యాటకులను అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఉగ్రవాదులు ఒక్కసారిగా చుట్టుముట్టి విచక్షణారహితంగా వారిపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో మొత్తం 28 మంది పర్యాటకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు అక్కడ అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా 2019లో పుల్వామా దాడి తర్వాత జమ్మూ లోయల్లో జరిగిన అత్యంత కిరాతకమైన దాడి ఇది అని చెప్పవచ్చు. ఈ దాడిని నిరసిస్తూ ప్రదేష్ కాంగ్రెస్ కమిటీ(PCC) తో సహా వివిధ పార్టీలు బుధవారం బంద్ ప్రకటించి, నిరసనకు పిలుపునిచ్చాయి. దీంతో జమ్ము కాశ్మీర్ అంతటా కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు.


పహాల్గామ్ దాడిపై స్పందిస్తున్న సెలబ్రిటీలు..

ఇకపోతే ఈ దాడిని ఖండిస్తూ సామాన్యుల నుంచి రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. ఉగ్రవాద దాడిలో మరణించిన అమాయకుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ నుండి ఒక్కొక్కరుగా సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుండి ఎన్టీఆర్(NTR ), రామ్ చరణ్ (Ram Charan), మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), అల్లు అర్జున్(Allu Arjun), మాలీవుడ్ నుండి మోహన్ లాల్ (Mohanlal), కోలీవుడ్ నుండి కమలహాసన్ (Kamal Haasan), బాలీవుడ్ నుండి సంజయ్ దత్(Sanjay Dutt ), అక్షయ్ కుమార్ (Akshay Kumar), సోనూ సూద్ (Sonu sood) ఇలా ఒక్కొక్కరుగా దీనిపై స్పందిస్తున్నారు.


ఎన్టీఆర్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా..

“పహాల్గాం దాడి బాధితుల గురించి తెలిసి నా హృదయం ద్రవించి పోయింది. దాడిలో మరణించిన వారి కుటుంబాలకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను” అంటూ తెలిపారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పందిస్తూ..

“పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడి నన్ను మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. చాలా బాధగా అనిపించింది. ఇలాంటి వాటిని తీవ్రంగా ఖండించాలి. ఈ కష్ట సమయాన్ని తట్టుకొని నిలబడే మనో ధైర్యాన్ని దేవుడు ఆ బాధిత కుటుంబాలకు ఇవ్వాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు.

చిరంజీవి తన ఎక్స్ ఖాతా ద్వారా..

“జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మంది అమాయక ప్రజలను, పర్యాటకులను బలిగొన్న ఈ దారుణమైన దాడి భయంకరమైనది, హృదయ విదారకమైనది. ఇది క్షమించరాని క్రూరమైన చర్య. మరణించిన వారి కుటుంబాలకు నా హృదయం సానుభూతి తెలియజేస్తుంది. వారు అనుభవించిన నష్టాన్ని ఏదీ పూరించలేదు. వారి కోసం నా సంతాపం తెలియజేస్తూ వారికి ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అంటూ చిరంజీవి ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు..

మోహన్ లాల్ తన ఎక్స్ ఖాతా ద్వారా..

“పహల్గామ్ ఉగ్రవాద దాడిలో బలైపోయిన బాధితులను చూసి నా హృదయం ద్రవించిపోయింది. ఇంత క్రూరత్వాన్ని చూడటం చాలా బాధాకరం. అమాయకుల ప్రాణాలను బలిగొనడాన్ని ఏ కారణం కూడా సమర్థించదు. దుఃఖిస్తున్న కుటుంబాలకు, మీ దుఃఖం మాటల్లో చెప్పలేనిది. దయచేసి మీరు ఒంటరివారు కాదని తెలుసుకోండి. మొత్తం దేశం మీతో పాటు దుఃఖంలో నిలుస్తుంది. చీకటిలో కూడా శాంతి నెలకొంటుందనే ఆశను మనం ఒకరినొకరు కొంచెం గట్టిగా పట్టుకుందాం..ఆ నమ్మకాన్ని ఎప్పటికీ వదులుకోవద్దు” అంటూ ట్వీట్ చేశారు.

అల్లు అర్జున్ తన ఎక్స్ ఖాతా ద్వారా..

అక్షయ్ కుమార్ తన ఎక్స్ ఖాతా ద్వారా..

కమల్ హాసన్ ఇలా ట్వీట్ చేశారు..

సంజయ్ దత్ ఎక్స్ పోస్ట్..

సోను సూద్ ఎక్స్ పోస్ట్ ..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×