Nani About Chiranjeevi : కొన్ని రాజకీయ పరిస్థితుల వలన దాదాపు 10 ఏళ్ల పాటు మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. చాలామంది అభిమానుల కోరిక వలన ఖైదీ నెంబర్ 150 సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమాను పూరి జగన్నాథ్ చేయాల్సి ఉంది. ఆల్మోస్ట్ అన్ని ఫైనల్ అయిపోయాయి అనుకునే టైంలో కొంతమంది చెప్పిన మాటలు వలన మెగాస్టార్ చిరంజీవి ఒక రీమేక్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమాతో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టారు మెగాస్టార్. అయితే పూరీ జగన్నాథ్ మెగాస్టార్ చిరంజీవితో ఎప్పటినుంచో సినిమా చేయాలి అని అనుకుంటున్నారు. కానీ అది కుదరట్లేదు ఒక రెండు సార్లు పూజ వరకు వెళ్లి కూడా సినిమా ఆగిపోయిన దాఖలాలు ఉన్నాయి.
యంగ్ డైరెక్టర్స్ కు అవకాశం
మెగాస్టార్ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సీనియర్ డైరెక్టర్స్ ను పెద్దగా నమ్ముకోకుండా కేవలం యంగ్ డైరెక్టర్స్ కు మాత్రమే అవకాశాలు ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇదివరకే బాబి వాల్తేరు వీరయ్య సినిమాతో అద్భుతమైన హిట్ సినిమాను మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో వేశారు. మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారు అలా చూపిస్తూ కామెడీ టైమింగ్ కూడా పర్ఫెక్ట్ గా బయటకు తీశాడు. ఇక ప్రస్తుతం బింబిసారా దర్శకుడు వశిష్టత మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కొన్ని కారణాల వలన ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ఇక తాజాగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను నాని ప్రొడ్యూస్ చేస్తున్నారు.
ప్రొడ్యూసర్ గా నాని ఫీలింగ్
మెగాస్టార్ చిరంజీవిని నాని పలు సందర్భాలలో కలిశారు. అయితే ప్రొడ్యూసర్ గా కలవడం మాత్రం ఒక రకమైన ఎక్స్పీరియన్స్ అంటూ నాని చెప్పుకొచ్చాడు. చిరంజీవి గారిని కలిసిన వెంటనే ఆయన తినడానికి బజ్జీలు పెట్టారట. అంత మాట్లాడుకున్న తర్వాత బ్లడ్ తెప్పించండి మీ ఇద్దరి చేతిలో కలిపి ఇలా చేద్దాం అని చెప్పారట. దానికి వెంటనే మెగాస్టార్ చిరంజీవి ఎలా వస్తాయి మీకు ఐడియాలు అంటూ మాట్లాడారు. అంతేకాకుండా అప్పుడు మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ కలర్ షర్ట్ వేసుకుంటే, వైట్ షర్ట్ మార్చుకోండి అని నాని చెప్పారట. దానితో మెగాస్టార్ చిరంజీవి అలాగే ప్రొడ్యూసర్ గారు అంటూ చెప్పి మార్చుకుని వచ్చారట. ఆ క్షణం ఓ నేను ప్రొడ్యూసర్ కదా అనే ఫీలింగ్ నాకు వచ్చింది అంటూ నాని రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.
Also Read : Anil Ravipudi : నాకు ఆ దర్శకుడులా ఉండాలి అనిపిస్తుంది, కానీ ఉండలేను