BigTV English

Celebrity couples who got Divorced: ప్రేమలో పడి.. పెళ్లి చేసుకొని.. విడిపోయిన సెలబ్రిటీ జంటలివే..!

Celebrity couples who got Divorced: ప్రేమలో పడి.. పెళ్లి చేసుకొని.. విడిపోయిన సెలబ్రిటీ జంటలివే..!

Celebraties Love Marriage and Divorce: సెలబ్రిటీల జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుకోవడం అందరికి ఆసక్తి.. అందులో వారి పెళ్లి, విడాకులు వంటి వాటిపై మరింత ఆసక్తి ఎక్కువే. ఎప్పుడు ఒకటవుతారో.. ఎప్పుడు విడిపోతారో చెప్పలేని పరిస్థితి. ప్రేమలు , పెళ్లిళ్లు, బ్రేకప్‌లు, విడాకులు ఇండస్ట్రీలో సర్వసాధారణం అయినప్పటికి. వాటి వెనుక కారణాలు అనేకం.


అలాగే ఈ మధ్యకాలంలో చాలా మంది నటీనటులు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం జరిగినా. ఆ బంధాలు ఎక్కువ కాలం నిలవలేకపోయాయి. చాలా జంటల మధ్య సఖ్యత లోపించడం వల్లో.. ప్రేమించి పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే విడిపోతున్నారు. ఇలా ఈ మధ్య సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారంటే మాత్రం అది టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతుంది. మరి ఈ రోజు ప్రేమికుల రోజు.. అయితే ఈ సందర్భంగా ప్రేమించి పెళ్లి చేసుకొని విడిపోయిన జంటల గురించి ఇప్పుడు చూద్దాం

పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్‌
పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఈ పేరు వింటేనే ఎదో వైబ్రెషన్‌. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు పవన్ కళ్యాణ్. 2008లో తన మొదటి భార్య నందినీకి విడాకులు ఇచ్చి.. ఆ తర్వాత హీరోయిన్ రేణు దేశాయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టాక 2012లో విడాకులు తీసుకున్నారు. అప్పట్లో ఇది టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. మళ్లీ 2013లో రష్యా కు చెందిన నటి అన్నా లెజినోవాను ప్రేమించి పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఆమెతో జీవితాన్ని కొనసాగిస్తున్నారు.


నాగచైతన్య – సమంత :
ఇప్పుటికి వీరిద్దరు కలవాలని అభిమానులు కోరుకుంటుంటారు. ఏ మాయ చేసావే సినిమాతో మొదలైన నాగచైతన్య సమంతల ప్రేమ.. ౨౦౧౭లో పెళ్లి దాకా వెళ్లింది. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించుకోని మరీ అంగరంగ వైభవంగ ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఏం జరిగిదో తెలిదు కాని.. మనస్పర్ధలు రావడంతో సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. పెళ్లి జరిగిన నాలుగు సంవత్సరాలకే వీరు విడిపోయారు.

కమల్ హాసన్ – వాణి గణపతి
నటనకు మారుపేరైన కమల్‌ హాసన్‌ 1978లో ప్రముఖ నాట్య కళాకారిణి వాణి గణపతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత ఆమెకు విడాకులు ఇచ్చి 1988లో సారిక ను వివాహం చేసుకున్నారు. ఇక శృతిహాసన్, అక్షర హాసన్ జన్మించిన తర్వాత 2004లో విడిపోయారు. ఆ తర్వాత ప్రస్తుతం గౌతమితో 13 ఏళ్లుగ సహజీవనం చేస్తున్నారు.

ప్రకాష్ రాజ్ – లలితా కుమారి
ఏ పాత్రకైనా న్యాయం చేస్తు విలక్షణ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ మొదట లలితా కుమారిని వివాహం చేసుకున్నారు. ఆ తరువాత మనస్సర్థల కారణంగ 2009లో వీరు విడియారు. మళ్లీ 2010లో ప్రముఖ కొరియోగ్రాఫర్ సోనీ వర్మాను వివాహం చేసుకున్నారు.

వీరితోపాటు రాధికా శరత్ కుమార్ , నాగార్జున, ప్రకాష్ కోవెలమూడి , కీర్తి రెడ్డి , సుమంత్, సునీత, మంచు మనోజ్ ,ప్రణీత, ఝాన్సీ, జోగినాయుడు, సుప్రియ యార్లగడ్డ ఇలా పలువురు సెలబ్రిటీలు మొదట ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడిపోయారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×