BigTV English

Six Super Foods : ఇవి తిన్నారంటే.. మీ ఇమ్యూనిటీ పైపైకే..!

Six Super Foods : ఇవి తిన్నారంటే.. మీ ఇమ్యూనిటీ పైపైకే..!

Immunity Booster Foods : ఎండాకాలం ప్రారంభమైంది. ఫలితంగా వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. దీని కారణంగా మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి ఫ్లూ, జలుబు వంటి వ్యాధులు రావొచ్చు. కానీ ఇటువంటి వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ఆరు సూపర్ ఫుడ్స్ ఉన్నాయి. ఇవి మన రోగ నిరోధక శక్తిని పెంచి ఈ సమ్మర్‌లో ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. మీ డైట్‌లో చేర్చుకోవాల్సిన ఆ ఆరు సూపర్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం.


మీ ఆహారంలో సూపర్‌ ఫుడ్‌లను చేర్చడమే కాకుండా.. తగినంత నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఒత్తిడి లేకుండా ఉండటం కూడా రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

Read More : సమ్మర్.. మీ చర్మాన్ని ఇలా అందంగా మార్చండి..!


పసుపు

పసుపు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ,యాంటీఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. పసుపును పాలలో కలుపుకోని తాగడం వల్ల ఆరోగ్య ఫలితాలు పొందుతారు. వంటల్లో కూడా పసుపు వాడటం మంచి ఆరోగ్య కరమైన అలవాటు.

వెల్లుల్లి

వెల్లుల్లిలో అల్లిసిన్ అనే పోషకాలు ఉంటాయి. ఇది మీ శరీరం వైరస్‌లతో పోరాడడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి,జింక్ పుష్కలంగా ఉంటాయి.ది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.చ్చి వెల్లుల్లి తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వంటల్లో మసాలాల కూడా వెల్లుల్లి ఉపయోగించవచ్చు.

పాలకూర

పాలకూరలో విటమిన్ సి, ఐరన్ మరియు ఫోలేట్ వంటి అనేక పోషకాలు నిండుగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇందులో ఉంటే యాంటీ ఆక్సిడెండ్లు ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని రక్షిస్తాయి. పాలకూరను వెజిటెబుల్‌గా తీసుకోవచ్చు.

పెరుగు

పెరుగులో ప్రోబయోటిక్స్ వంటి పోషకాలు ఉంటాయి. ఇది ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. అంతే కాకుండా పెరుగు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. పెరుగును అన్నం లేదా మజ్జిగ రూపంలో తాగొచ్చు.

సీజనల్ ఫ్రూట్స్

ఈ ప్రూట్స్‌లో విటమిన్ సి,యాంటీఆక్సిడెంట్స్,ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. సీజన్ బట్టి నారింజ, జామ, బొప్పాయి, దానిమ్మ వంటి పండ్లను తీసుకోవాలి.

Read More : సమ్మర్‌లో పర్ఫెక్ట్ డ్రింక్స్ ఇవే..!

Disclaimer : ఈ కథనం వైద్య నిపుణుల సలహా మేరకు, పలు అధ్యయనాల ఆధారంగా రూపొందించబడిన సమాచారం మాత్రమే

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×