BigTV English

Yevam Trailer: ‘క్యూఆర్ కోడ్ స్కాన్ చెయ్.. ప్రభాస్‌తో డిన్నర్ చెయ్’.. ట్రైలర్ గూస్‌బంప్స్

Yevam Trailer: ‘క్యూఆర్ కోడ్ స్కాన్ చెయ్.. ప్రభాస్‌తో డిన్నర్ చెయ్’.. ట్రైలర్ గూస్‌బంప్స్

Chandini Chaudhary’s Yevam Trailer Out Now: కలర్ ఫొటో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది నటి చాందిని చౌదరి. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇటీవలే విశ్వక్ సేన్ ‘గామి’ మూవీలో హీరోయిన్‌గా నటించి మంచి క్రేజ్ అందుకుంది. ఇందులో తన యాక్టింగ్‌తో అదరగొట్టేసింది. ఈ మూవీ మంచి హిట్ కావడంతో పలు సినిమాలలో నటించే ఛాన్స్ కొట్టేసింది.


అందులో ఇప్పుడు లేడీ ఓరియేంటెడ్ మూవీ ఒకటి చేస్తుంది. అదే ‘యేవమ్’. క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో చాందిని చౌదరి పోలీస్ పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్‌, టీజర్ ఓ రేంజ్‌లో సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచేందుకు మేకర్స్ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్ సినీ ప్రియుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ట్రైలర్ ప్రకారం.. ముందుగా పోలీస్టేషన్‌లో జాయిన్ అయిన సౌమ్య (చాందిని)ని ఆ పోలీస్ స్టేషన్ సీఐ భరత్ రాజ్.. తనను ఫైల్స్ సెక్షన్‌లో వేయమంటాడు. అయితే పోలీస్‌గా ఏదో సాధిద్దాం అని వచ్చిన సౌమ్యకు అది నచ్చదు. అయితే అదే విషయాన్ని సౌమ్య తన ఇంట్లో చెప్పగా.. ‘‘ఆడపిల్లలను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు’’ అని సౌమ్య తండ్రి చెప్తాడు.


Also Read: ఎమోషనల్ డ్రామాగా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’.. ట్రైలర్ రిలీజ్

అలా.. కొన్నాళ్ళు అందులో చేసిన తర్వాత అక్కడ వారితో స్నేహం ఏర్పడుతుంది. అక్కడ వరకు క్లాస్‌గా వెళ్లిన ట్రైలర్ ఒక్కసారిగా సస్పెన్స్ థ్రిల్లర్ వైపు వెళ్లింది. క్యూ ఆర్ స్కాన్ చేయండి.. ప్రభాస్‌తో డిన్నర్ చేయండి అని చెప్తూ ఓ వ్యక్తి అమ్మాయిలను ట్రాప్ చేస్తాడు. అలా వాళ్లతో డేట్ చేసి కిల్లర్ చంపేస్తుంటాడు. అప్పట్నుంచి ఆ కిల్లర్‌ని పట్టుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. మొత్తంగా ‘యేవమ్’ మూవీ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. చూస్తుంటే గూస్‌బంప్స్ వస్తున్నాయి. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా ఈ నెల అంటే జూన్ 14న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Tags

Related News

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Big Stories

×