BigTV English

Chandini Chowdary : తీవ్ర గాయం… సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పిన హీరోయిన్… మరి బాలయ్యతో సినిమా?

Chandini Chowdary : తీవ్ర గాయం… సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పిన హీరోయిన్… మరి బాలయ్యతో సినిమా?

Chandini Chowdary : టాలీవుడ్ యంగ్ బ్యూటీ చాందిని చౌదరి (Chandini Chowdary) ఇటీవల కాలంలో వరుసగా సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే చాలాకాలం నుంచి టాలీవుడ్ లో కెరీర్ ను కొనసాగిస్తున్న ఈ బ్యూటీ తాజాగా తీవ్ర గాయం అయింది అనే విషయం తెలియజేస్తూ సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నానని చెప్పి బాంబు పేల్చింది. మరి ఆ గాయం సంగతి ఏంటి? ఇప్పుడు ఆమె చేస్తున్న బాలయ్య సినిమా ముందుకు సాగినట్టేనా? అనే వివరాల్లోకి వెళితే…


ఎన్నో ఏళ్ల నుంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్న యంగ్ హీరోయిన్ల లిస్ట్ లో చాందిని చౌదరి (Chandini Chowdary) కూడా ఒకరు. అందం, అభినయం కావలసినంత ఉన్నప్పటికీ ఈ బ్యూటీకి అదృష్టం కలసి రావడం లేదు. కరోనా కాలంలో ‘కలర్ ఫోటో’ (Color Photo) సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ చాందిని చౌదరి ఇప్పుడైతే మంచి అవకాశాలే పట్టేస్తోంది. ఇటీవల కాలంలో ఆమె గామి, ఏవమ్, మ్యూజిక్ షాప్ మూర్తి వంటి సినిమాలతో కంటిన్యూగా ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే విశ్వక్ సేన్ హీరోగా నటించిన ప్రయోగాత్మక మూవీ ‘గామి’ చాందినికి మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. మిగతా సినిమాలేవీ పెద్దగా ఆడలేదు.

ఈ నేపథ్యంలోనే చాందిని చౌదరి (Chandini Chowdary)కి నందమూరి బాలయ్య (Balakrishna) తో కలిసి నటించే అద్భుతమైన అవకాశం దక్కింది. బాబీ దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటిస్తున్న ప్రాజెక్టులో చాందిని స్పెషల్ రోల్ చేస్తోంది. రీసెంట్ గా ఆమె లుక్ ను రిలీజ్ చేయగా, సెట్స్ లో ఆమె బాలయ్య తో కలిసి అల్లరి చేస్తున్నట్టు ఉన్న ఆ పోస్టర్లు నందమూరి అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా చాందిని చౌదరి తనకు వరుస సినిమాలతో బిజీగా ఉన్న టైంలోనే గాయం అయ్యిందంటూ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది.


ఆ పోస్ట్ లో చాందిని చౌదరి (Chandini Chowdary)… ‘హలో గాయ్స్ గత కొన్ని రోజుల నుంచి నేను సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండట్లేదు. కొన్ని నెలల క్రితమే నాకు గాయమైంది. అయితే దాని తీవ్రతను అర్థం చేసుకోకుండా అలాగే షూటింగ్ లో పాల్గొన్నాను. కానీ ఇప్పుడు ఆ గాయం మరింత తీవ్రంగా మారి ఇబ్బంది పెడుతోంది. షూటింగ్ లకు వెళ్తున్న టైంలో ఆ గాయం నన్ను మరింతగా బాధిస్తోంది. ఇప్పుడు నేను షూటింగ్ తో పాటు అన్నింటికీ దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యాను. అలాగే ఆరోగ్యం కుదుటపడిన తర్వాత సోషల్ మీడియాకు తిరిగి వస్తాను” అంటూ సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పింది.

తను గాయం నుంచి కోలుకునే వరకు షూటింగ్ లతో పాటు సోషల్ మీడియాకు కూడా బ్రేక్ ఇస్తున్నట్టుగా తాజా పోస్ట్ ద్వారా స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఆమె బాలయ్య సినిమా షూటింగ్ పూర్తి చేసిందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే కొన్ని రోజులపాటు చాందిని (Chandini Chowdary) బెడ్ రెస్ట్ కే పరిమితం అయ్యేలా కనిపిస్తోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×