Big Stories

Anantapur : అనంతపురంలో విషాదం.. విద్యుత్ షాక్ తో మహిళ మృతి..

Share this post with your friends

Anantapur : విద్యుత్ షాక్ తో మహిళ మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లో కెళ్తే ఎర్రంపల్లి గ్రామనికి చెందిన గొల్ల శిల్ప (29) అనే మహిళ కొత్త ఇల్లు నిర్మిస్తున్నారు. ఆమె ఉదయాన్నేఇంటికి నీరు పెట్టేందుకు వెళ్లింది.

శిల్ప నీటి మోటార్ ను ఆన్ చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలికి భర్త , కుమారుడు, కుమార్తె ఉన్నారు. కళ్యాణదుర్గం పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు ఆరా తీసి విచారణ చేశారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Latest News