Pawan Kalyan : అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలామంది కొత్త దర్శకులు పవన్ కళ్యాణ్ ను అప్రోచ్ అయ్యారు. వారిలో కొందరికి పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం కూడా లభించింది. ముఖ్యంగా పూరి జగన్నాథ్ తీసిన బద్రి సినిమా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కు ఒక ఆటిట్యూడ్ సెట్ చేసింది. తమ్ముడు, తొలిప్రేమ, బద్రి, ఖుషి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో పవన్ కళ్యాణ్ కెరియర్ లో వరుసగా పడటం వలన పవన్ కళ్యాణ్ కెరియర్ తారా స్థాయికి వెళ్లిపోయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో వచ్చిన జానీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఒక దర్శకుడిగా పవన్ కళ్యాణ్ అప్పుడు సక్సెస్ అయిన కూడా సినిమా అల్టిమేట్ గా ఫెయిల్ అయింది. ఆ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హిట్ సినిమా చేయడానికి దాదాపు 10 ఏళ్లు పట్టింది.
కంబ్యాక్ గబ్బర్ సింగ్
షాక్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన హరీష్ శంకర్. మొదటి సినిమాతోనే పెద్ద షాక్ తిన్నాడు. ఆ తర్వాత మళ్లీ అసిస్టెంట్ రైటర్ గా తన కెరియర్ మొదలుపెట్టాడు. మళ్లీ రవితేజ అవకాశం ఇవ్వడంతో మిరపకాయ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఇండస్ట్రీలో దర్శకుడుగా నిలబడిపోయాడు. హరీష్ శంకర్ దాని కెరియర్ లో ఎన్ని సినిమాలు చేసినా కూడా గబ్బర్ సింగ్ సినిమాకు ఉన్న స్థాయి వేరు స్థానం వేరు. ఆ సినిమాను హరీష్ డీల్ చేసిన విధానం చాలామందికి విపరీతంగా నచ్చేసింది. పవన్ కళ్యాణ్ ను అభిమానులు ఎలా అయితే చూడాలి అనుకుంటున్నారో అలా చూపించి బాక్సాఫీస్ వద్ద ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ను పవన్ ఖాతాలో వేశాడు. ముఖ్యంగా సినిమాలో కళ్యాణ్ కోసం రాసిన డైలాగ్స్ రియల్ లైఫ్ క్యారెక్టర్ కూడా వర్క్ అవుట్ అవుతాయి.
ఆశలన్నీ భగత్ సింగ్ పై
ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద కూడా అందరికీ విపరీతమైన అంచనాలు సినిమాకి సంబంధించి జరిగిన షెడ్యూల్ కూడా బాగానే ఉపయోగించుకున్నాడు హరీష్. ఈ సినిమా నుంచి విడుదలైన రెండు వీడియోలు కూడా అంచనాలను విపరీతంగా పెంచేశాయి. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత చాలా చేంజెస్ స్క్రిప్ట్ లో చేయమని చెప్పారు. అమ్మాయిలు వెనక పడే సీన్స్, కొన్ని వల్గర్ డైలాగ్స్ వంటివి ఈ సినిమాలో కట్ చేయమని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ సినిమా వీడియో రిలీజ్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ కరెంట్ సిట్యువేషన్ కి సరిపడా డైలాగ్స్ రాశాడు హరీష్. ఇక ఇప్పుడు ఉస్తాద్ కు ఎటువంటి మార్పులు చేస్తాడా అని చూడాలి.
Also Read : Suriya : మంచి మనసు చాటుకున్న సూర్య.. ఫౌండేషన్ కు భారీ సాయం..