Suriya : తమిళ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం.. తమిళ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా ఈ స్టార్ హీరోకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. తెలుగులో ఈయన సినిమాలు రిలీజ్ అవుతుండటంతో ఇక్కడ కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. రీసెంట్ గా సూర్య రెట్రో మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగులో ఈ సినిమా డిజాస్టర్ అయింది. తమిళ్లో మాత్రం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. టాలీవుడ్‌లో గత వారం అంతా కూడా నాని హిట్ 3 సందడే కనిపించింది. హిట్ 3 జోరులో అసలు రెట్రో మూవీనే కనిపించలేదు. రెట్రో మూవీకి తెలుగులో టాక్ బాగా లేకపోవడంతో వసూళ్ల పై ప్రభావం పడింది. అనుకున్న స్థాయిలో హిట్ అవ్వలేదు. సినిమాల సంగతి పక్కన పెడితే ఈయన సేవాకార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారు. తాజాగా సూర్య మంచి చాటుకున్నాడు. ఓ ఫౌండేషన్ కు భారీ సాయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హైలెట్ అవుతుంది..
రెట్రో మూవీ కలెక్షన్స్ ను ఫౌండేషన్ కు విరాళం..
సూర్య, పూజా హెగ్డే నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో.. మే 1 న భారీ అంచనాలతో థియేటర్లోకి వచ్చింది. తెలుగులో యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ తమిళ వెర్షన్ లో హిట్ అవ్వడంతో పాటు కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. తమిళంలో చూసుకుంటే మొదటి రోజు అక్కడ 17 కోట్లకు పైగా వచ్చిందట. అదే సూర్య కెరీర్ హయ్యస్ట్ అని అంటున్నారు. ఇక తాజాగా మేకర్లు రెట్రో మూవీకి వంద కోట్లు వచ్చాయని ప్రకటించారు.. అయితే ఈ కలెక్షన్స్ లో కొంత అమౌంట్ ని అరగం ఫౌండేషన్ కి సూర్య ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూసిన అభిమానులు సూర్య పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read : ఎలా పుడతార్రా పాకి కొ**ల్లారా.. సీపిఐ నారాయణ పై మండిపడ్డ నటుడు..
అరగం ఫౌండేషన్ కు రూ. 10 కోట్ల విరాళం..
హీరో సూర్య సేవా కార్యక్రమాలను ఎక్కువగా చేస్తున్నాడు. గతంలో తన అభిమానులకు అన్నదాన కార్యక్రమం చేసిన విషయం తెలిసిందే.. ఇక అరగం ఫౌండేషన్ కి రెడ్రో మూవీ కలెక్షన్స్ నుంచి 10 కోట్లను విరాళంగా ఇచ్చినట్లు తెలుస్తుంది. సూర్య తన అగరం ఫౌండేషన్‌ను ఎంత ప్రెస్టీజీయస్‌గా తీసుకుంటాడో అందరికీ తెలిసిందే. అగరం ఫౌండేషన్ ద్వారా వేల మంది విద్యార్థుల్ని చదిస్తున్నానని, అందులో చాలా మంది ఇప్పుడు సెటిల్ అయ్యాడని చెబుతుంటాడు. టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవిని తీసుకొని ఈ అరగం ఫౌండేషన్ ని మొదలుపెట్టినట్లు గతంలో చాలా సందర్భాల్లో సూర్య బయటపెట్టారు. ఇక ప్రస్తుతం సూర్య సినిమాల విషయానికొస్తే.. మెట్రో సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నా సూర్య మరో రెండు ప్రాజెక్టులలో నటిస్తున్నాడని తెలుస్తుంది. త్వరలోనే ఆ ప్రాజెక్టుల గురించి పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉందని సమాచారం..
#Suriya Donated 10crs To Agaram Foundation From The Profits Of #Retro ..🤝 Man With a Golden Heart..❣️ pic.twitter.com/jXbr2jpN3B
— Laxmi Kanth (@iammoviebuff007) May 7, 2025