Mulugu district: తెలంగాణలోని కర్రెగుట్టలో ఏం జరిగింది.. ఇంకా ఏం జరుగుతోంది? మావోయిస్టుల గురించి సమాచారం బలగాల వద్ద నుందా? గాలింపు వెనుక అసలు కథేంటి? కర్రెగుట్టకు రావద్దని మావోల హెచ్చరిక అందుకేనా? తాజాగా మందుపాతర పేలుడుతో ముగ్గురు పోలీసులు మృతి చెందినట్టు సమాచారం. అసలు గుట్టలో ఏం జరుగుతోంది?
ములుగు జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీన్ని అధికారులు ధృవీకరించాల్సి ఉంటుంది. వెంకటాపురం మండలంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం బలగాలు కూంబింగ్ చేస్తుండగా మందుపాతర పేలినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మృతి చెందగా, పలువురు గాయపడినట్టు సమాచారం.
దాదాపు మూడు వారాలుగా..
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కర్రెగుట్ట ప్రాంతంలో భారీ ఎత్తున మావోయిస్టులు ఉన్నట్లు బలగాలకు సమాచారం అందింది. ఈ క్రమంలో కర్రెగుట్ట ప్రాంతంలో భారీగా బలగాలు మొహరించాయి. బలగాలు ఎట్టి పరిస్థితుల్లో అడవులోకి రావద్దని మావోలు ముందుగా హెచ్చరిక చేశారు. అయినా మావోలు ఏరివేత లక్ష్యంగా బలగాలు మందుకు కదులుతున్నాయి.
దాదాపు 16 రోజులపాటు కర్రెగుట్టలో తుపాకుల మెతతో దద్దరిల్లింది. మావోల ఆచూకీ కోసం ఓవైపు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టాయి బలగాలు. లభించిన ఆధారాలతో బలగాలు దూసుకు పోతున్నాయి. మావోల కీలక నేతలు ఆ ప్రాంతంలో ఉండడంతో ఇరువర్గాల మధ్య భీకరమైన కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో దాదాపు 30 మంది మావోలు చనిపోయినట్టు అంతర్గత సమాచారం.
ALSO READ: ప్రేమించాడో లేక మోసపోయాడో రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య
ప్రస్తుతానికి 20 మంది మృతదేహాలను గుర్తించాయి బలగాలు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారుల మాట. ఈ నేపథ్యంలో గాలింపు ముమ్మరం చేశాయి బలగాలు. ఈ క్రమంలో మావోలు అమర్చిన మందుపాతర పేలి ముగ్గురు పోలీసులు మృతి చెందినట్టు సమాచారం. గాయపడినవారిని హెలికాప్టర్‌లో ఆసుపత్రులకు తరలించినట్టు వార్తలు వస్తున్నాయి.
బలగాలు అక్కడే మకాం
కర్రెగుట్టల్లో తాత్కాలిక బేస్ క్యాంపులను ఏర్పాటు చేశాయి బలగాలు. అక్కడి నుంచి కొండల్లోకి అడుగులు వేస్తున్నాయి. ఆపరేషన్‌లో చిత్రీకరించిన వీడియో మావోలు హెవీ మెషీన్ గన్ ఉపయోగించినట్టు తెలిసింది. తూటాలతో కూడిన బెల్ట్‌లో 235 తూటాలు ఉంటాయి. ఒక్కసారి ట్రిగ్గర్ నొక్కితేచాలు ప్రత్యర్థులపై గుళ్ల వర్షం కంటిన్యూ కురిపిస్తుందని అంటున్నారు.
కర్రెగుట్టల్లో తాత్కాలిక బేస్ క్యాంపులను ఏర్పాటు చేశాయి బలగాలు. అక్కడి నుంచి కొండల్లోకి అడుగులు వేస్తున్నాయి. బలగాలు ఆపరేషన్ క్లోజ్ చేస్తే తప్ప, అక్కడ ఏం జరిగిందనే ఎవరికీ తెలీదని అంటున్నారు స్థానికులు.