BigTV English

Chhaava: శంభాజీ మహారాజ్ దెబ్బకి పుష్పరాజ్ అవుట్…

Chhaava: శంభాజీ మహారాజ్ దెబ్బకి పుష్పరాజ్ అవుట్…

Chhaava: హిస్టారికల్ మూవీ ‘ఛావా’ థియేటర్లలోకి వచ్చి నెల రోజులు అయింది. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ ప్రతిరోజూ బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయల వ్యాపారం చేస్తోంది. విడుదలైన ఒక నెల తర్వాత కూడా విక్కీ కౌశల్ నటించిన ఈ చిత్రం ఇతర బ్లాక్ బస్టర్ చిత్రాల రికార్డులను బద్దలు కొడుతూనే ఉంది. 30వ రోజు కూడా ‘ఛావా’ కలెక్షన్ల పరంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ఈ మూవీ ఏకంగా బాక్సాఫీస్ సెన్సేషన్ ‘పుష్ప 2’ని క్రాస్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది.


‘ఛావా’ సినిమా మొదటి వారంలోనే రూ.225.28 కోట్లతో బాక్సాఫీస్ ఖాతాను ఓపెన్ చేసింది. ఈ సినిమా రెండవ వారంలో 186.18 కోట్లు, మూడవ వారంలో 84.94 కోట్లు, నాల్గవ వారంలో 43.98 కోట్లు వసూలు చేసింది. 29వ రోజు కూడా విక్కీ కౌశల్ సినిమా రూ.7.25 కోట్లు రాబట్టింది. ఇప్పుడు 30వ రోజు కలెక్షన్ల రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది.

‘ఛావా’ 30వ రోజు ఇంత డబ్బు సంపాదించింది…


విక్కీ కౌశల్ ‘ఛావా’ మార్చి 7 నుండి తెలుగు భాషలో కూడా విడుదలైంది. హిందీతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబడుతోంది. 30వ రోజు కలెక్షన్ల గురించి మాట్లాడుకుంటే, వరల్డ్ వైడ్ ‘ఛావా’ సినిమా రూ.8 కోట్లు వసూలు చేసింది. అంటే, ఒక నెలలోనే ‘ఛావా’ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ నుండి మొత్తంగా రూ.568.18 కోట్లు వసూలు చేసింది.

‘పుష్ప 2’ కంటే రెట్టింపు కలెక్షన్లు వచ్చాయి…

30వ రోజుల కలెక్షన్ల పరంగా భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘పుష్ప 2’ను కూడా ‘ఛావా’ అధిగమించింది. ‘ఛావా’ సినిమా 30వ రోజు అల్లు అర్జున్ సినిమా కంటే దాదాపు రెట్టింపు వసూళ్లు రాబట్టింది. ‘పుష్ప 2’ విడుదలైన 30వ రోజున భారతదేశంలో రూ.4.35 కోట్లు వసూలు చేసింది. ‘ఛావా’ దాదాపు 8 కోట్లు కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం.

‘ఛావా’ ఈ చిత్రాల రికార్డులను బద్దలు కొట్టింది…

ఒక నెలలోనే ‘ఛావా’ సినిమా ‘యానిమల్’, ‘పఠాన్’, ‘గదర్ 2’, ‘సలార్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను ఓడించి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇదే బాక్సాఫీస్ రన్ ని ఇంకొన్ని రోజులు మైంటైన్ చేస్తే ‘ఛావా’ సినిమా ‘స్త్రీ 2’ని బీట్ చేయడం గ్యారెంటీ. స్త్రీ 2 సినిమా భారతదేశంలో రూ. 597.99 కోట్లు వసూలు చేసింది, ఈ మార్క్ ని రీచ్ అవ్వడానికి ‘ఛావా’ సినిమాకి ఇంకెన్ని రోజులు పడుతుందో చూడాలి.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×