Chhaava in Telugu :మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ పుత్రుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ఛావా (Chhaava). శంభాజీ మహారాజ్ పాత్రలో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్(Vicky kaushal), శంభాజీ మహారాజ్ భార్య యేసు భాయ్ పాత్రలో నేషనల్ రష్మిక మందన్న (Rashmika Mandanna) చాలా అద్భుతంగా నటించారు. లక్ష్మణ్ ఉటేకర్(Lakshman Utkar) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన విడుదల అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమా గురించి భారత ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) కూడా ప్రశంసించారు అంటే, ఇక ఏ రేంజ్ లో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు.ఈ సినిమా విడుదలైన అతి తక్కువ సమయంలోనే భారీ కలెక్షన్లు వసూలు చేస్తూ దూసుకుపోతున్న ఈ సినిమా 12 రోజుల్లోనే సుమారుగా రూ.420 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటికీ హౌస్ ఫుల్ థియేటర్లతో రన్ అవుతోంది ఈ చిత్రం. ముఖ్యంగా బాలీవుడ్ లో విడుదలైన సినిమాలు కూడా ఈ సినిమా దెబ్బకు విలవిల్లాడిపోతున్నాయని చెప్పవచ్చు.
మార్చి 7న తెలుగులో రిలీజ్..
ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మార్చి 7వ తేదీన ఛావా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాను తెలుగులో గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజ్ చేయబోతున్నారట. అంతేకాదు ఈ తెలుగు వర్షన్ కి విక్కీ కౌశల్ వాయిస్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఇవ్వనున్నట్లు సమాచారం. మొత్తానికైతే భారీ అంచనాల మధ్య వచ్చిన ఛావా, అక్కడ భారీ సూపర్ హిట్ సొంతం చేసుకొని ఇప్పుడు తెలుగులో కూడా అదే సత్తా చాటడానికి సిద్ధమవుతోంది. మరి మార్చి 7న విడుదల కాబోతున్న ఈ సినిమా తెలుగు ఆడియన్స్ ను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.
ఛావా మూవీ కలెక్షన్స్..
అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్యదత్త తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ (AR Rahman)స్వరాలు అందించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషకం ప్రమోషనల్ కార్యక్రమాలు కలిపి ఈ సినిమాకు దాదాపు రూ.130 కోట్లకు పైగా బడ్జెట్ అయింది. మడోక్ పిక్చర్స్ బ్యానర్ పై దినేష్ విజన్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఫిబ్రవరి 14న భారత్లో 4500 స్క్రీన్ లలో, ప్రపంచవ్యాప్తంగా 5500 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మార్నింగ్ షో నుంచే సూపర్ హిట్ టాక్ కు సొంతం చేసుకుంది. 11 రోజుల్లోనే రూ.450 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా 12వ రోజు రూ.20 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ రాబట్టింది. ఇప్పటివరకు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.495 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టు సమాచారం. ఒక ఇండియా నుండి రూ.415 కోట్ల వసూళ్లు రాబట్టగా.. ఇక ఓవర్సీస్ నుంచి రూ.70 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. ఇక తెలుగులో ఈ సినిమా ఇంకెన్ని కలెక్షన్లు రాబడుతుందో చూడాలి.