BigTV English

Marco: ‘మార్కో’ దర్శకుడికి బంఫర్ ఆఫర్.. బాలీవుడ్ బడా నిర్మాతతో డీల్..

Marco: ‘మార్కో’ దర్శకుడికి బంఫర్ ఆఫర్.. బాలీవుడ్ బడా నిర్మాతతో డీల్..

Marco: ఈరోజుల్లో దర్శకులు, స్టార్ హీరోలు.. ఇలా ఎవరూ కూడా ఒకే భాషకు పరిమితం కావడం లేదు. ఒక భాషలో సక్సెస్ సాధించిన తర్వాత ఇతర భాషల్లో కూడా అవకాశాలు కోసం ట్రై చేస్తున్నారు. అలా ఇప్పటికీ ఎంతోమంది సౌత్ డైరెక్టర్లు.. బాలీవుడ్‌కు వెళ్లి తమ సత్తా చాటుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో సౌత్ డైరెక్టర్లకే విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఈ లిస్ట్‌లోకి మరో సౌత్ డైరెక్టర్ కూడా యాడ్ అవ్వనున్నాడు. తనే ‘మార్కో’ డైరెక్టర్ హనీఫ్ అదేని (Haneef Adeni). అసలు ‘మార్కో’ సినిమాకు ప్రత్యేకంగా పరిచయం లేని రేంజ్‌లో తెరకెక్కించి అన్ని భాషల్లో హిట్ కొట్టిన హనీఫ్.. తాజాగా బాలీవుడ్ బడా నిర్మాత నుండి బంఫర్ ఆఫర్ అందుకున్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి.


హిందీలో కూడా హిట్

సౌత్‌లో ఏ దర్శకుడికి మంచి గుర్తింపు లభించినా కూడా వారిని వెంటనే బాలీవుడ్‌లోకి తీసుకోవాలని కొందరు మేకర్స్ ఎదురుచూస్తున్నారు. అలాంటి వారిలో కరణ్ జోహార్ (Karan Johar) ఒకరు. అలా ‘మార్కో’ హిట్ తర్వాత హనీఫ్ అదేనికి అదిరిపోయే ఆఫర్ ఇచ్చాడట కరణ్. తనతో కలిసి సినిమా నిర్మించడానికి ఒప్పుకున్నాడట. దీంతో ఈ దర్శకుడు ఏకంగా జాక్‌పాట్ కొట్టాడంటూ ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ‘మార్కో’ మూవీ ముందుగా కేవలం మలయాళ భాషలోనే విడుదలయ్యింది. కానీ మలయాళంలో దీనికి లభిస్తున్న క్రేజ్ చూసి ఇతర భాషల్లో కూడా దీనిని డబ్ చేశారు. అలా ఈ మూవీ హిందీలో కూడా డబ్ అయ్యి బ్లాక్‌బస్టర్ సాధించింది.


గుర్తుండిపోయే సినిమా

మలయాళ మేకర్స్ కేవలం ఫీల్ గుడ్ సినిమాలనే తెరకెక్కించగలరు. వారికి అవే కరెక్ట్ అంటూ చాలామంది ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. అలాంటి మాలీవుడ్ నుండి ‘మార్కో’ (Marco) లాంటి వైలెంట్ మూవీ రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతే కాకుండా ఈ సినిమా ఓ రేంజ్‌లో వైలెన్స్ చూపించి సూపర్ డూపర్ హిట్ కూడా అయ్యింది. హనీఫ్ అదేని లాంటి ఒక యంగ్ డైరెక్టర్ ఇలాంటి ఒక వైలెంట్ మూవీని తెరకెక్కించి మాలీవుడ్‌లో ల్యాండ్‌మార్క్‌గా నిలిచేలా చేశాడని ఎన్నో ఏళ్లు గుర్తుండిపోతుంది. హిందీలో ‘మార్కో’ను ‘యానిమల్’తో పోలుస్తూ ఆ సినిమా కంటే ఇదే వైలెంట్‌గా ఉంది అంటూ కామెంట్స్ చేశారు ప్రేక్షకులు. అందుకే హనీఫ్ బాలీవుడ్ డెబ్యూ బాధ్యతలను కరణ్ జోహార్ తీసుకున్నాడు.

Also Read: ఫ్యాన్స్‌కు శుభవార్త.. బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్ షురూ.!

మరో యాక్షన్ థ్రిల్లర్

మరీ ‘మార్కో’లాగా కాకపోయినా హనీఫ్ అదేని, కరణ్ జోహార్ కాంబినేషన్‌లో తెరకెక్కే మూవీ కూడా యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లోనే ఉంటుందని సమాచారం. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కే ఈ సినిమా కోసం భారీ బడ్జెట్‌ను కేటాయించడానికి కరణ్ జోహార్ సిద్ధంగా ఉన్నాడట. కేవలం హిందీలో ఈ సినిమాను తెరకెక్కించి ఇతర భాషల్లో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లడానికి మరికాస్త సమయం పడుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం హనీఫ్.. ఉన్ని ముకుందన్‌తోనే ‘మార్కో 2’ను తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నాడు. ఆలస్యం లేకుండా ఈ సీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×