White Hair Remedies: వయస్సు పెరిగే కొద్దీ ప్రతి ఒక్కరూ తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కుంటారు. కానీ నేటి కాలంలో చిన్న వయస్సులోనే చాలా మంది జుట్టు తెల్లబడుతోంది. తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడే వారు రకరకాల హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయితే వీటిని వాడకం ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఇలా చేయడం వల్ల కూడా జుట్టు కృత్రిమంగా కనిపిస్తుంది. కానీ తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చవచ్చని మీకు తెలుసా ? అవును కోన్ని రకాల నేచురల్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతే కాకుండా మీ జుట్టుకు పోషణ కూడా లభిస్తుంది. మరి ఎలాంటి హోం రెమెడీస్ జుట్టును నల్లగా మారుస్తాయనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉసిరి, శీకాకాయ:
ఉసిరి, శీకాకాయ రెండూ సహజంగా జుట్టుకు మేలు చేస్తాయి. వీటిని ఉపయోగించడం కోసం 2 ఉసిరి కాయలు , చిన్న కప్పులో శికాకాయలని తీసుకుని నీటిలో మరిగించాలి. 15 నిమిషాల తర్వాత కషాయం తయారు అవుతుంది. ఈ కషాయాన్ని జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత తలస్నానం చేయాలి.ఈ కషాయం జుట్టు రంగును సహజంగానే నల్లగా మార్చడంలో సహాయపడుతుంది.అంతే కాకుండా జుట్టుకు పోషణను అందిస్తుంది.
కొబ్బరి నూనె, కరివేపాకు:
జుట్టు సహజంగా నల్లబడటానికి కొబ్బరి నూనె, కరివేపాకు చాలా బాగా ఉపయోగపడతాయి. వీటితో తయారు చేసిన నూనె జుట్టుకు చాలా మేలు చేస్తుంది. ఇందుకోస ముందుగా 1 కప్పు కొబ్బరి నూనెను తీసుకుని మీడియం మంట మీద వేడి చేయాలి. తర్వాత ఇందులో 1 చిన్న కప్పు కరివేపాకులను వేయాలి. దీనిని 30 నిమిషాలు వేడి చేయండి. తర్వాత నూనెను వడకట్టి చల్లబరచాలి. చల్లారిన తర్వాత జుట్టుకు బాగా అప్లై చేయండి. దీన్ని క్రమం తప్పకుండా వాడటం వల్ల మీ తెల్ల జుట్టు కూడా నల్లగా మారతుంది. అంతే కాకుండా బలంగా కూడా మారుతుంది.
బాదం నూనె, తేనె:
బాదం నూనె, తేనె వాడటం వల్ల మీ జుట్టు సహజంగా నల్లగా మారడం ప్రారంభమవుతుంది. ఇది మాయిశ్చరైజింగ్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. అంతే కాకుండా జుట్టును మెరిసేలా , బలంగా చేస్తుంది. దీనికోసం, 1 కప్పు బాదం నూనెలో 2 చెంచాల తేనె కలిపి జుట్టుకు అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత జుట్టును వాష్ చేయండి. ఇలా తరచుగా చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.
కాఫీ, శికాకాయ్ :
కాఫీ , శికాకాయ జుట్టును నల్లగా చేయడంలో, పోషణను అందించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి మీరు కషాయాన్ని తయారు చేసుకోవచ్చు. కషాయాన్ని జుట్టుకు అప్లై చేసిన తర్వాత, 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో వాష్ చేయండి. దీనిని వాడటం వల్ల జుట్టు తక్కువ సమయంలోనే నల్లగా మారుతుంది.
Also Read: సమ్మర్‌లో తక్షణ మెరుపు కోసం.. ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి !
హెన్నా, ఉసిరి:
హెన్నా జుట్టుకు సహజ రంగును కలిగిస్తుంది. అంతే కాకుండా ఇది జుట్టును నల్లగా చేస్తుంది. ఉసిరిలో విటమిన్ సి ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దీనికోసం, హెన్నా , ఉసిరి ముక్కలను పేస్ట్ లా చేసి మీ జుట్టుకు చక్కగా అప్లై చేయండి. తర్వాత 30 నిమిషాల తర్వాత చల్లటి నీటితో మీ జుట్టును వాష్ చేయండి. దీనిని తరచుగా వాడటం వల్ల ఎంత తెల్ల జుట్టయినా నల్లగా మారుతుంది.