Chhaava : నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ఫిమేల్ లీడ్ గా నటించిన లేటెస్ట్ హిందీ మూవీ ‘ఛావా’ (Chhaava). బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో హిందీలో దూసుకెళ్తున్న ఈ సినిమా థియేటర్లలో తాజాగా రియల్ శంభాజీ దర్శనం ఇచ్చాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా రియల్ శంభాజీ థియేటర్లలో దర్శనమిచ్చినప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూడండి.
థియేటర్లలో రియల్ శంభాజీ
విక్కీ కౌశల్ (Vicky Kaushal) హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఛావా’. లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఫిబ్రవరి 14న థియేటర్లలోకి వచ్చింది. పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ సినిమాలో శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ అద్భుతంగా నటించాడు అంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్ చూసాక ప్రేక్షకులు కంటతడి పెట్టకుండా థియేటర్లలో నుంచి బయటకు రావట్లేదు.
మరి ఇలాంటి ఎమోషనల్ టైంలో రియల్ గా శంభాజీ మహారాజ్ కనిపిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ క్రేజీ ఫీలింగ్ ని థియేటర్లలో ఉన్న ప్రేక్షకులు ఎక్స్పీరియన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో విక్కీ కౌశల్ శంభాజీ మహారాజ్ గెటప్ వేసుకుని గుర్రంపై క్లైమాక్స్ తర్వాత థియేటర్లలో దర్శనమిచ్చారు. ఇక అప్పటికే క్లైమాక్స్ చూసి ఎమోషనల్ అయిన ప్రేక్షకులను ఆయనను చూసి, ఒక్కసారిగా షాక్ అయ్యి వీడియోలు తీసుకోవడం మొదలు పెట్టారు. పైగా థియేటర్లు జేజేలతో మార్మోగిపోయాయి.
3 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో…
ఇదిలా ఉండగా ‘ఛావా’ మూవీ తాజాగా 100 కోట్ల క్లబ్ లో చేరింది. మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే రూ. 33.1 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక పాజిటివ్ టాక్ రావడంతో రెండవ రోజు కలెక్షన్లు మరింత మరింతగా పెరిగి, రూ. 39.3 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టింది. మూడవరోజు అంతకంటే రెట్టింపు జోరుతో కొనసాగుతూ ఈ మూవీ ఏకంగా రూ.49.03 కోట్లు కలెక్ట్ చేసింది. మొదటి రెండు రోజులు కంటే ఈ మూవీ మూడవ రోజు భారీ కలెక్షన్లు రాబట్టడం విశేషం. మొత్తానికి మూడు రోజుల్లోనే ఈ మూవీ ఏకంగా రూ.121.43 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేయడం విశేషం.
కత్రినా కైఫ్ రియాక్షన్…
విక్కీ కౌశల్ యాక్టింగ్ అద్భుతంగా ఉంది అంటూ ప్రశంసలు రావడం పట్ల కత్రినా కైఫ్ స్పందించింది. “శంభాజీ పాత్రకు జీవం పోశావు. చివరి 40 నిముషాలు అద్భుతంగా ఉంది. మీ యాక్టింగ్ ను వర్ణించడానికి మాటలు రావట్లేదు. మీ కెరీర్ లోనే బెస్ట్ మూవీ ఇది. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది” అంటూ కత్రినా కైఫ్ ‘ఛావా’ టీంకు అభినందనలు తెలిపింది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">