Chhaava Telugu Trailer:ఛత్రపతి శివాజీ వారసుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా హిందీలో ఇటీవల విడుదలైన చిత్రం ఛావా(Chhaava) . వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన విడుదలైన ఈ సినిమా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా హిందీ నుంచి వచ్చిన ఈ చిత్రానికి యావత్తు దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు నిరాజనాలు పడుతున్నారు. శంభాజీ మహారాజ్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ (Vicky kaushal)ఒదిగిపోయి మరీ నటించారు. అంతేకాదు ఈ పాత్ర కోసం ఆయన పడిన కష్టాన్ని ఇటీవల మేకర్స్ విడుదల చేయగా.. ఈ పాత్ర వెనుక విక్కీ అంత కష్టపడ్డారా అని అందరూ ఆశ్చర్యపోయారు. శంభాజీ మహారాజ్ భార్య యేసు భాయి పాత్రలో రష్మిక మందన్న (Rashmika Mandanna) చాలా అద్భుతంగా నటించింది.. ముఖ్యంగా రాజు రాజ్యాన్ని వదిలి ఇతర రాజ్యాలపై దండెత్తడానికి వెళ్ళినప్పుడు.. రాజ్యంలో ఏర్పడిన కష్టాలను తొలగించడానికి.. తనవంతుగా నిలిచి, రాజ్య ప్రజలకు అండగా నిలిచిన క్యారెక్టర్ లో రష్మిక కూడా చాలా అద్భుతంగా నటించింది. ఇక ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ (Lakshman utkar) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒక వండర్ అని విశ్లేషకుల సైతం చెబుతున్నారు
తెలుగు ట్రైలర్ రిలీజ్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న డైలాగ్స్..
ఇదిలా ఉండగా ఈ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేస్తూ మార్చి 7వ తేదీన విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.. ఈ మేరకు తాజాగా తెలుగు వెర్షన్ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్లో డైలాగ్స్ అదిరిపోయాయని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు అందర్నీ కూడా ఈ ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. డైలాగ్స్ అన్నీ కూడా గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు.