Minister Nara Lokesh: అసెంబ్లీ వేదికగా గత జగన్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్. గత ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు డ్రాపౌట్ అయినట్టు వ్యాఖ్యానించారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చ నేపథ్యంలో వివిధ పార్టీల సభ్యులు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు.
వైసీపీ నిర్లక్ష్యం
గతంలో జరిగిన తప్పులు, చేపడుతున్న చర్యల గురించి వివరణ ఇచ్చారు సదరు మంత్రి. గత ప్రభుత్వం జీవో నెం.117 తీసుకొచ్చి పేదలకు ప్రభుత్వ విద్యను దూరం చేశారని అన్నారు మంత్రి లోకేష్. దాని కారణంగా ప్రభుత్వ పాఠశాలకు 12 లక్షల మంది విద్యార్థులు దూరమయ్యారని చెప్పుకొచ్చారు.
117 జీవోకి ప్రత్యామ్నాయం కొత్తగా చర్యలు తీసుకొచ్చేందుకు చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. దీనిపై సోమవారం సాయంత్రం సభ్యులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. శాసనసభ్యుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ముందు బేసిక్ సదుపాయాలపై ఫోకస్ చేస్తున్నట్లు తెలిపారు సదరు మంత్రి.
మౌళిక సదుపాయాల కోసం
రాష్ట్రంలో పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణానికి దాదాపు రూ.3 వేల కోట్లు అవసరమవుతాయని చెప్పారు. MNREGS నిధులతో దశల వారీగా వాటి నిర్మాణాలు చేపడతామన్నారు. పాఠశాలలకు స్టార్ రేటింగ్ విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. తల్లిదండ్రుల సమావేశంలో మౌళిక సదుపాయాలు, మంచి ఎడ్యుకేషన్‌పై స్టార్ రేటింగ్ ఏర్పాటు చేశామన్నారు. ఏ పాఠశాలలో బేసిక్ సదుపాయాలు లేని వాటిపై ఫోకస్ చేస్తున్నట్లు తెలిపారు.
ALSO READ: జగన్ నియోజకవర్గంలో రైతు హ్యాపీ
సీసీ టీవీలు, పాఠశాలల వద్ద లైటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి. లెర్నింగ్ ఎక్స్ లెన్స్ ఆఫ్ ఏపీ కింద సీఎస్ఆర్ నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎలా అయితే సీఎస్ఆర్ ద్వారా అభివృద్ధి చేస్తున్నారో, మనం కూడా అలాగే చేద్దామన్నారు.
డ్రగ్స్ నిర్మూలనకు ‘డ్రగ్స్ వద్ద బ్రో’ అనే కార్యక్రమాన్ని ‘ఈగల్’ వంటి సంస్థ ఆధ్వర్యంలో చేపడుతోందన్నారు. స్కూళ్లు, జూనియర్ కాలేజీలు ఈగల్ క్లబ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. విద్యార్థుల్లో దీనిపై చైతన్యం తీసుకొస్తామన్నారు. వీటిని కంట్రోల్ చేయకుంటే ఒక తరం నాశనం అవుతుందన్నారు.
డీఎస్సీపై కీలక ప్రకటన
గత ప్రభుత్వం చేపట్టిన నాడు-నేడు కార్యక్రమంపై అనేక ఆరోపణలు వచ్చాయన్నారు మంత్రి లోకేష్. దానిపై నివేదిక రాగానే సభ ముందు పెడతామన్నారు. ఆ తర్వాత చర్యలు తప్పవని సూటిగా చెప్పేశారు. అలాగే మెగా డీఎస్పీపైనా క్లారిటీ ఇచ్చారు మంత్రి. మెగా డీఎస్సీపై వైసీపీ ఎమ్మెల్యేలు పలు ప్రశ్నలు లేవనెత్తారు. వారు లేకపోయినా సమాధానాలు ఇస్తామన్నారు.
16,347 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ ప్రకటన త్వరలో విడుదల చేయడం జరుగుతుందన్నారు మంత్రి లోకేష్. వైసిపి ప్రభుత్వం హయాంలో ఒక్క డిఎస్సీ విడుదల చేయలేదు. 30 ఏళ్లలో టీడీపీ ప్రభుత్వాల హయాంలో 13 డిఎస్సీలను నిర్వహించింది. వాటిలో 1,80,272 టీచర్ పోస్టులను భర్తీ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు ప్రభుత్వం హయాంలో మూడు డిఎస్సీలను నిర్వహించింది. తద్వారా 16,701 టీచర్ పోస్టులను భర్తీచేసింది.
గత ప్రభుత్వం చేతకానితనం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో 12 లక్షల డ్రాపౌట్స్: నారా లోకేష్
జీవో నెం.117 తీసుకొచ్చి పేదలకు ప్రభుత్వ విద్యను దూరం చేశారు
117 జీవోకి ప్రత్యామ్నాయం తీసుకొచ్చేందుకు చర్చలు జరుపుతున్నాం
టీచర్ల బదిలీలు, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాం
ఇన్ఫ్రాస్ట్రక్చర్… pic.twitter.com/rsHxcF59G3
— BIG TV Breaking News (@bigtvtelugu) March 3, 2025