Actor Manchu Manoj : దాదాపు రెండేళ్ల క్రితం మంచు మనోజ్ తన ఇంటికి వచ్చి మా మనుషుల్ని విష్ణు ఎలా కొడుతున్నాడో చూడండి అంటూ ఒక వీడియోను రిలీజ్ చేశాడు. అయితే ఆ వీడియో అప్పుడు సోషల్ మీడియాలోనూ, మీడియాలోనూ బాగా వైరల్ గా మారింది. అక్కడితో మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నీ అవాస్తవమని తెలుపుతూ ఇది రియాలిటీ షో కోసం మేము చేస్తున్న వీడియో అంటూ మంచు విష్ణు ఒక సందర్భంలో తెలిపారు అయితే అందరూ కూడా దానిని నిజమే అనుకొని నమ్మరు కానీ ఇప్పటివరకు ఆ రియాల్టీ షో విడుదల కాలేదు. ఇక గత కొద్దిరోజులుగా మంచి ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ గొడవలు తారాస్థాయికి చేరిపోయాయి. మంచు మనోజ్ మంచు మోహన్ బాబు మంచు విష్ణు వీరి ముగ్గురు ఒకరి మీద ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకునే స్థాయికి వచ్చేసింది.
ఈ వివాదం ఎట్టకేలకు ఆగిపోతుంది అనుకుంటే ఇంకా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మంచి మోహన్ బాబు మనోజ్ పై దాడి చేయడం, మనోజ్ వాళ్లపై దాడి చేయడం జరుగుతూనే ఉంది. ఇక తాజాగా తిరుపతి జిల్లాలోని బకరాపేట పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తిరుపతి సమీపంలోని లేక్ వ్యాలీ రిసార్ట్స్ లో మంచు మనోజ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ తో పాటు ఉంటుండగా.. డిన్నర్ కు కూర్చుంటున్న టైంలో పోలీసులు వచ్చి తమ గోప్యత కు భంగం కలిగించారని పోలీసులపై మనోజ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీని గురించి పలు రకాల కథనాలు కూడా వినిపించాయి. అయితే వీటన్నింటికీ సమాధానంగా మంచు మనోజ్ ఇప్పుడు ఒక వీడియోను విడుదల చేశాడు.
Also Read : Pushpa 2 Collections: ఫైనల్ లెక్కలు బయటపెట్టిన ‘పుష్ప 2’ మేకర్స్.. మొత్తానికి ఎంత వచ్చిందంటే.?
ముందుగా అందరికీ క్షమాపణలు చెబుతూ అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది అంటూ క్లారిటీ ఇస్తూ వచ్చారు.. మా కాలేజీ కోసం, మా కాలేజీ ఎదురుగా పని చేసుకుంటున్నా స్టాఫ్ కోసం, నేను మొదటి నుంచి దాని గురించి మాట్లాడుతుంటే దానిని పక్కన పెట్టేసి ఇంకేవేవో వివాదంలోకి తీసుకొస్తున్నారు. నా మీద అటాక్ చేస్తూ నా కుటుంబ సభ్యుల్ని లాగుతున్నారు. నేను భయపడతాను అనుకుంటున్నారేమో అది జరగని పని. నా మీద, నా భార్య మీద దాదాపు 30కి పైగా కేసులు వేశారు. నిజానికి ఒకే వెర్షన్ ఉంటుంది, అబద్దానికి చాలా వెర్షన్లు ఉంటాయి. ఇది జరిగింది. ఒక్కొక్కరు ఒక్కోరకంగా వార్తలు రాస్తున్నారు నా దగ్గర నిజంగా ఫ్యాక్ట్ ఉంది. నా తప్పైతే నా కాలర్ పట్టుకుని అడగండి అంటూ మంచు మనోజ్ రియాక్ట్ అయ్యారు.
Also Read : Siddique : లైంగిక వేధింపుల కేసులో సాలిడ్ సాక్ష్యాలు… నటుడికి మెడకు బిగుస్తున్న ఉచ్చు