Pawan Kalyan..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒకవైపు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపడుతూనే.. మరొకవైపు కుటుంబ బాధ్యతలు కూడా చేపట్టిన విషయం తెలిసిందే. అంతే కాదు అటు అభిమానులను సంబరపరచడానికి తాను సైన్ చేసిన సినిమాలను కూడా విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఇలా తీరిక లేకుండా గడుపుతున్న పవన్ కళ్యాణ్ కు ఇటీవల సడన్ షాక్ తగిలింది. అసలు విషయంలోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్ మూడవ భార్య అన్నా లెజినోవా ప్రస్తుతం తన కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ (Mark Shankar Pawanovich) తో సింగపూర్ లో ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పటిలాగే మార్క్ శంకర్ సింగపూర్ లో ఉండే తన స్కూల్ కి వెళ్లారు. కానీ అక్కడ అనుకోకుండా అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో..ఆ ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లు , చేతులకు గాయాలయ్యాయి. అంతేకాదు ఆ గాయాల కారణంగా ఎంతో ఇబ్బంది పడ్డారు. పైగా మంటలు పూర్తిగా వ్యాపించడంతో పొగ కమ్ముకుంది. ఆ పొగ మార్క్ శంకర్ ఊపిరితిత్తుల్లోకి చేరిపోయింది. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడడంతో హుటాహుటిన అక్కడి సిబ్బంది మార్క్ శంకర్ ను హాస్పిటల్ కి తరలించారు.
తండ్రితో పాటు హైదరాబాద్ చేరుకున్న మార్క్ శంకర్..
.
ఇక వెంటనే బాలుడికి చికిత్స అందించిన వైద్యులు ఆ తర్వాత ఊపిరితిత్తులలో పొగ చూరడం వల్ల భవిష్యత్తులో ఏదైనా సమస్య కలిగే అవకాశం ఉందని, ముందుగానే బ్రాంకోస్కోపీ చేయించారు. అలా నాలుగు రోజులపాటు హాస్పిటల్లోనే చికిత్స అందుకున్నారు మార్క్ శంకర్. ఏప్రిల్ 8వ తేదీన ఈ సంఘటన జరగగా.. ఏప్రిల్ 9వ తేదీన పవన్ కళ్యాణ్ సింగపూర్ కి చేరుకొని, తన కొడుకు ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడి వైద్యులను ఆరా తీశారు. ఇక ప్రస్తుతం మార్క్ శంకర్ కోలుకోవడంతో పవన్ కళ్యాణ్ మార్క్ శంకరును అలాగే తన భార్యను తీసుకొని ఈరోజు ఉదయం హైదరాబాద్ కి చేరుకున్నారు. ఇకపోతే మార్క్ శంకర్ హైదరాబాదుకి రావడంతో అభిమానులు పలు రకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు
ALSO READ:Aishwarya Rajesh : హిట్ ని ఇలా వాడేస్తుంది… ఒక్క షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తే ఎన్ని కోట్లంటే?
ఇకపై మార్క్ శంకర్ బాధ్యత వారిదే..
అసలు విషయంలోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు రాజకీయాలు ఇటు సినిమాలు అంటూ బిజీగా తీరిక లేకుండా గడిపేస్తున్నారు. కాబట్టి ఇకపై తన కొడుకు బాధ్యతను తన అన్నయ్య చిరంజీవి (Chiranjeevi ), వదినమ్మ సురేఖ (Surekha ) దంపతులకు అప్పగించనున్నారట. బాలుడికి సంబంధించిన ప్రతి విషయంలో కూడా వీరిద్దరిదే నిర్ణయం కావాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నట్లు సమాచారం. అంతేకాదు ఇకపై ఇక్కడే మార్క్ శంకర్ ఉండబోతున్నారని, తన విద్యను కూడా ఇక్కడే పూర్తి చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ తమ్ముళ్ళయిన నాగబాబు(Nagababu ) పవన్ కళ్యాణ్ లను ఇండస్ట్రీకి పరిచయం చేసింది మొదలు వారికంటూ ఒక ఇమేజ్ను అందించే వరకూ చిరంజీవి దంపతులు ఎంతో శ్రమించారు. వీరినే కాకుండా వీరి వారసుల బాధ్యతను కూడా తీసుకున్నారు. ఇప్పుడు తమ కొడుకు బాధ్యతను కూడా అన్నయ్య , వదిన తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారట. ఈ మేరకే ఇప్పుడు మార్క్ శంకర్ ను కూడా ఇండియాకి తీసుకువచ్చినట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఒకవేళ మార్కు శంకర్ కెరియర్ చిరంజీవి చేతిలో పడిందంటే మాత్రం.. మార్కు శంకర్ ఊహించని స్థాయికి వెళ్ళిపోతారని మెగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.