BigTV English

Odela 2 : చిన్నపిల్లలు చూడొద్దు.. తమన్నా సినిమా పై షాకింగ్ సెన్సార్ రిపోర్ట్.

Odela 2 : చిన్నపిల్లలు చూడొద్దు.. తమన్నా సినిమా పై షాకింగ్ సెన్సార్ రిపోర్ట్.

Odela 2 : టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్న, హెబ్బా పటేల్ కీలక పాత్రలు పోషిస్తున్న సినిమా ఓదెల 2. సంపత్ నందితో కలిసి డి మధు ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు.ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రానుంది. 2022 లో వచ్చిన మొదటి పార్ట్ సూపర్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు సీక్వెల్ తో మూవీ టీం మన ముందుకు రానున్నారు. మిల్కీ బ్యూటీ ఈ సినిమాలో శివశక్తి పాత్రలో కనిపించనున్నారు. సినిమాలో కీలక పాత్రల్లో వశిష్ట, యువ నాగమహేష్, నటిస్తున్నారు.తెలుగులో కుమారి 21ఎఫ్ సినిమాతో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న హెబ్బా పటేల్, ఈ సినిమాతో మంచి హిట్టుని అందుకుంది ఇప్పుడు సీక్వెల్ లోను నటిస్తుంది.తెలుగు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన తమన్నా ఈ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. ఈ సినిమా ఏప్రిల్ 17న విడుదలకు సిద్ధంగా ఉంది. అందులో భాగంగా మూవీ టీం పై సెన్సార్ రిపోర్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నా వివరాలు చూద్దాం..


సెన్సార్ కట్ ..

అశోక్ తేజ దర్శకత్వంలో మిల్కీ బ్యూటీ తమన్నా నాగ సాధువు పాత్రలో వస్తున్న సినిమా ఓదెల 2. ఈ మూవీ ఇప్పుడు సెన్సార్ పూర్తి చేసుకుంది. సినిమాలోని కొన్ని సన్నివేశాలు, చిన్నపిల్లలని భయపెట్టే విధంగా ఉన్నాయని, సినిమా పెద్దవారికి మాత్రమే అని, సెన్సార్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ సినిమాకు సెన్సార్ A సర్టిఫికెట్ ఇచ్చింది. రన్ టైం 149 నిమిషాల 50 సెకండ్లు గా ఉంది. అంటే దాదాపు రెండు గంటల 30 నిమిషాలు. సినిమా U/A సర్టిఫికెట్ ఇవ్వనందున, చిన్నపిల్లలు సినిమా చూడద్దంటున్నారు విశ్లేషకులు. వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సెన్సార్ రిపోర్ట్ మూవీ టీం కి షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు.


 భారీ స్థాయిలో బడ్జెట్ ..

వేసవి కానుకగా ఈ సినిమాను ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. 25 కోట్ల బడ్జెట్ తో భారీ స్థాయిలో ఈ సినిమాని నిర్మించారు. థియేట్రికల్ హక్కులు కూడా మంచి మొత్తానికి వసూలు చేసినట్టు తెలుస్తుంది. ఓవర్సీస్ హక్కులను 10 కోట్లకు కొనుగోలు చేసినట్టు టాక్. సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఫస్ట్ పార్ట్ లో నటి హెబ్బా పటేల్ నటించి మెప్పించారు ఇప్పుడు ఈ సినిమాలోని తమన్నా తో కలిసి నటిస్తున్నారు.అక్క ,చెల్లెలు గా నటించనున్నారు. అజినీష్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.

RGV: హార్రర్ కామెడీతో వస్తున్న రామ్ గోపాల్ వర్మ.. ఎన్ని యుద్ధాలు జరుగుతాయో

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×