BigTV English

IPL 2024 Playoff Scenario: ప్లే ఆఫ్ కి ఏ జట్లు వెళతాయి..? ఆ నాలుగు జట్లు ఏవి..?

IPL 2024 Playoff Scenario: ప్లే ఆఫ్ కి ఏ జట్లు వెళతాయి..? ఆ నాలుగు జట్లు ఏవి..?

ప్రస్తుతం ఐపీఎల్ లో ఆడుతున్న పది జట్లను చూస్తే ముంబై, పంజాబ్ రెండు జట్లకు ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి. అధికారికంగా చెప్పలేదంతే. ఇక రెండు పోతే ఎనిమిది మిగిలాయి. ఇందులో రెండు జట్లు కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మొదటి నుంచి టాప్ లో ఉన్నాయి. బహుశా ఇవి వెళతాయని అంటున్నారు.

కాకపోతే ఇప్పటికి 16 పాయింట్లతో పటిష్టంగా కనిపించినా, వెనుక వస్తున్న జట్లు, అవి ఆడాల్సిన మ్యాచ్ లు లెక్క వేస్తే, ఇవి ఇంకొక్క మ్యాచ్ గెలిస్తే మాత్రం తిరుగులేకుండా ప్లే ఆఫ్ కి చేరుకుంటాయి. లేదంటే రన్ రేట్ లో ఇరుకున పడేందుకు అవకాశాలున్నాయి. అయితే ఇవి ఇంకా మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉన్నాయి. కాబట్టి దిగులు లేదు. ఇవి రెండూ బిందాస్ గా వెళ్లిపోతాయని అనుకుందాం.


Also Read: పంజాబ్ కింగ్స్ బెంగళూరు మ్యాచ్.. న్యూటన్ థర్డ్ లా అప్లై చేసిన కోహ్లీ..

ప్లే ఆఫ్ కి వెళ్లే నాలుగు జట్లలో రాజస్థాన్, కోల్ కతా తీసి వేస్తే, మరో రెండింటికి అవకాశం ఉంది. ఇప్పుడీ స్థానాలకి నాలుగు జట్లు పోటీ పడుతున్నాయి. అందులో హైదరాబాద్, చెన్నయ్, ఢిల్లీ, లక్నో పోటీ పడుతున్నాయి. అందులో హైదరాబాద్ 12 మ్యాచుల్లో 7 విజయాలు నమోదు చేసి 14 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది.

వీటిలో ఢిల్లీ, లక్నో ఒకొక్కటి 12 మ్యాచ్ లు ఆడేశాయి. ఇంక వీరికి ఆడాల్సిన మ్యాచ్ లు రెండే ఉన్నాయి. ఇవి వరుసగా గెలిస్తే 16 పాయింట్లతో ముందడుగు వేస్తాయి. ఇది ఒక లెక్కగా ఉంది.

మరోవైపు చెన్నయ్ 11 మ్యాచ్ లే ఆడింది. 12 పాయింట్లతో ఉంది. ఇంకా 3 మ్యాచ్ లు ఆడాల్సినవి ఉన్నాయి. ఇక్కడ నుంచి మూడు వరుసగా గెలిస్తే 18 పాయింట్లతో తిరుగులేకుండా ప్లే ఆఫ్ కు చేరుతుంది. చెన్నయ్ కి ఒక మ్యాచ్ అడ్వాంటేజ్ గా ఉంది.

Also Read: Shubman Gill: చెన్నైపై విజయం.. గిల్‌కు భారీ షాక్..

ఇక్కడికి రెండు జట్లు అంటే రాజస్థాన్, కోల్ కతా సేఫ్ జోన్ లో ఉంటే, రెండు జట్లు ముంబై, పంజాబ్ ప్లే ఆఫ్ అవకాశాలు కోల్పోయాయి. అంటే నాలుగు జట్ల లెక్క తేలి పోయింది.

మరో నాలుగు జట్లు పైన చెప్పుకున్న హైదరాబాద్, లక్నో, ఢిల్లీ, చెన్నయ్ 12 పాయింట్లతో ఉన్నాయి. ఇవి వరుసగా గెలవాలి. వ్యవహారం పీకల వరకు వచ్చింది. ఇక్కడికి 8 జట్ల సంగతులు తెలిసాయి. ఇక చివరిగా ఆర్సీబీ, గుజరాత్ విషయానికి వస్తే..

మొదట్లో ఓడిపోయిన ఆర్సీబీ, ఆలస్యంగా తేరుకుని, ఇప్పుడు వరుసగా గెలుస్తూ వస్తోంది. అది ప్రస్తుతం 10 పాయింట్లతో ఉంది. ఇంక ఆడాల్సినవి 2 మ్యాచ్ లే ఉన్నాయి. ఇవి రెండు కూడా గెలిస్తే 14 పాయంట్లతో నిలుస్తుంది.

గుజరాత్ టైటాన్స్  అయితే 8 పాయింట్లతో అట్టడుగున పడి ఉంది. ఇంకా ఆడాల్సినవి 3 మ్యాచ్ లు ఉన్నాయి. ఇది కూడా వరుసగా గెలిస్తే 14 పాయింట్లతో నిలుస్తుంది.

Also Read: సీఎస్కే ముందడుగు వేస్తుందా?.. నేడు గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్

పైన చెప్పుకున్నవన్నీ కూడా గెలిస్తేనే అని అనుకున్నాం. మరి ఓడిపోతే పరిస్థితేమిటి?అనేది ఎవరికీ తెలీదు. ఎందుకంటే ఏరోజు మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందో ఎవరికీ తెలీదు. ఇప్పుడు ఓడిపోతున్న దశ నుంచి ఆర్సీబీ, ఢిల్లీ గెలుపు బాట పట్టలేదూ.. ఇదీ అంతే.. అలాగే హైదరాబాద్ వీరకొట్టుడు చూస్తుంటే ప్లే ఆఫ్ కి వెళుతుందని  గంటాపథంగా పలువురు చెబుతున్నారు.

మరి తర్వాత మ్యాచ్ లు ఓడిపోతే ఎవరేం చేయలేని స్థితి ఉంది. అందుకే ప్రస్తుతానికి ఐపీఎల్ పిక్చర్ అయితే ఇలా ఉంది. చాలామంది అది గెలిచి, ఇది ఓడిపోతే, ఇది గెలిచి అది ఓడిపోతే అని కన్ ఫ్యూజ్ చేస్తున్నారు. రాస్తున్నారు. అది కరెక్టు కాదు. గెలుస్తుందని భావించే మనం లెక్కలు కడితేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. లెక్క కరెక్టుగా వస్తుంది. మరి మీరు  ఆలోచించండి. మీ బుర్రకి పదును పెట్టండి.

Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×