Chiranjeevi: టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని స్టార్ హీరో అయ్యాడు. ఆయనతో పాటుగా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అబ్బాయిలను సినిమాల్లోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్న ఫ్యామిలీలలో చిరంజీవి ఫ్యామిలీ కూడా ఉంది. ఆయన ఫ్యామిలీ హీరోలు ఇప్పుడు స్టార్ హోదాలో ఉన్నారు. తన కొడుకు రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడు. అయితే చిరంజీవి కేరీర్ మొదట్లో చెన్నైలో ఉండేవాడని అందరికి తెలిసిందే. కొన్ని సినిమాలు సక్సెస్ అయ్యాక హైదరాబాద్ లో సెటిల్ అయ్యాడు. అయితే చెన్నై లో షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ కూడా తోడుగా ఉండేవాడట.. ఒకరోజు పవన్ చేసిన పనికి చిరంజీవి షాక్ అయ్యాడట.. అసలు పవన్ కళ్యాణ్ ఏం చేశాడంటే..?
అసలు విషయానికొస్తే.. చిరంజీవి హీరోగా తన కెరిర్ ని ప్రారంభించిన కొత్తలో చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉండేవాడు. అందువల్ల ఎక్కువ శాతం చిరంజీవి సినిమా షూటింగులు చెన్నై లోనే జరిగేవి. ఒకసారి కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. అప్పుడు అక్కడ స్థానికంగా ఉండే కొంతమంది కుర్రాల్లు షూటింగ్ లొకేషన్ కు వచ్చి షూటింగ్ కు ఇబ్బంది పెట్టేవారట. చిరంజీవిని, డైరెక్టర్ కోడి రామకృష్ణను అల్లరి చేస్తూ బూతులు తిట్టారట. కానీ దానిని చిరంజీవి పెద్దగా పట్టించుకోకపోయినా, ఆయన డ్రైవర్ ద్వారా ఆ విషయం పవన్ కళ్యాణ్ మాత్రం అన్నను అంటే ఓర్చుకోలేక పోయాడట. ఇక ఎవరికీ చెప్పకుండా వెళ్లి ఆ కుర్రాళ్ళను చితక బాదాడట.. ఆ విషయం చిరంజీవికి తెలియడంతో షాక్ అయ్యాడట.. ఆ అల్లరి మూక తమ్ముడికి ఎక్కడ హాని కలిగిస్తారో అని భయపడి అందరికి క్షమాపణలు చెప్పాడని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
పవన్ కళ్యాణ్ ముక్కు సూటి మనిషి మాత్రమే కాదు. కోపిష్టి కూడా.. అంతకన్నా ముందు ఆయనకు కరాటే కూడా వచ్చున్న విషయం తెలిసిందే. కరాటేలో మంచి ప్రావిన్యం ఉన్న పవన్ కళ్యాణ్ వారితో గొడవ పడ్డాడట. ఈ క్రమంలోనే అందులో ఒక్కరికి భారీగా గాయాలు అయ్యి ఆసుపత్రి లో చేరారు. ఇక ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి ఆసుపత్రికి వెళ్లి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ చేసిన ఆ తప్పుకి ఆయన క్షమాపణలు చెప్పి.. వారి అవసరాల కోసం కొంత డబ్బు కూడా ఇచ్చారట.. ఇక అప్పుడు చిరంజీవి ఎవరిని కొట్టొద్దని మాట తీసుకున్నాడట. ఇక అప్పటి నుంచి పవన్ ఎవరితోనూ గొడవలకు పోలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఏం కా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడట.. త్వరలోనే వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అటు చిరంజీవి వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ప్రస్తుతం విశ్వంభరా మూవీ చేస్తున్నాడు. సమ్మర్ లో మూవీ రిలీజ్ కాబోతుంది.