OTT Movie : రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలను చూసేటప్పుడు వచ్చే థ్రిల్ మాటల్లో చెప్పలేము. వీటిలో కొన్ని సినిమాలు మంచి మెసేజ్ ను కూడా ఇస్తాయి. సోషల్ మీడియా వల్ల ఎంత మంచి జరుగుతుందో అంతే చెడు కూడా జరుగుతుంది. ఏకాంత వీడియోలకు బానిస అయిన ఒక వ్యక్తి వల్ల, కొన్ని కుటుంబాలు ఎలా ఇబ్బంది పడతాయో ఈ మూవీలో తెలుసుకోవచ్చు. ఈ మూవీ పేరేమిటి ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ పేరు ‘లెన్స్‘ (Lens). ఈ మూవీకి జయప్రకాష్ రాధాకృష్ణన్ ర్శకత్వం వహించారు. ఈ సినిమా మలయాళం, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందింది. ఇందులో ఆనంద్‌సామి, జయప్రకాష్ రాధాకృష్ణన్ ప్రధాన పాత్రలు పోషించారు. అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో లెన్స్ మూవీ ప్రదర్శించబడింది. మలయాళ వెర్షన్‌ను ఎల్‌జె ఫిల్మ్స్ పంపిణీ చేయగా, తమిళ వెర్షన్‌ను నిర్మాత వెట్రిమారన్ పంపిణీ చేశారు. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
అరవింద్ అనే పెళ్లి కూడా అయిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి అశ్లీల వీడియోలకు బానిస అవుతాడు. ఒకరోజు అమ్మాయిలతో వీడియో చాట్ చేస్తుంటాడు. భార్య ఏం చేస్తున్నారు అని అడిగితే, ఆఫీస్ వర్క్ అని అబద్ధం చెప్తాడు. భార్య ఏదో పని ఉంది అని బయటికి వెళ్తుంది. ఇంట్లో అరవింద్ ఒక వీడియో కాల్ మాట్లాడుతుంటాడు. అందులో అమ్మాయి ప్లేస్ లో అబ్బాయి వస్తాడు. నేను సూసైడ్ చేసుకోబోతున్నా, ఆ వీడియోని నువ్వు చూడాలని యువన్ అనే వ్యక్తి అరవింద్ కి చెప్తాడు. అరవింద్ భయపడి వీడియో కాల్ కట్ చేస్తాడు. సడన్ గా అతని ఫోన్ కి అరవింద్ ఏకాంత వీడియో ఒకటి వస్తుంది. ఆ వ్యక్తి మళ్ళీ నేను చనిపోయే వీడియో చూడమని లేకపోతే నీ వీడియో ఇంటర్నెట్ లో పెడతానని చెప్తాడు. చేసేది ఏమి లేక మళ్లీ నెట్లో వీడియోని చూస్తాడు. యువన్ మంచం మీద ఉన్న అమ్మాయికి బట్టలు తీయడం స్టార్ట్ చేస్తాడు. అరవింద్ కళ్ళు మూసుకోగా, నువ్వు చూడాలని అతనితో చెప్తాడు. చివరకు ఆమె ఎవరో కాదు అరవింద్ భార్య. అరవింద్ ఏడుస్తూ తనని ఏమి చేయకండి అని బతిమాలితాడు. ఈ లోగా అరవింద్ తన ఫ్రెండ్ తో పోలీసులకు ఇన్ఫామ్ చేయాల్సిందిగా చెప్తాడు. పోలీసులు అతన్ని పట్టుకునే దిశగా వెళ్తారు.
ఇంతకీ యువన్ ఈ పని ఎందుకు చేస్తున్నాడంటే.. ఒకరోజు యువన్ తన భార్య తో ఉన్న ఏకాంత వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఆ వీడియో వల్ల అతని భార్య చాలా డిప్రెషన్ లోకి వెళ్లి పోతుంది. చివరికి ఆమె మానసిక వెధనతో చచ్చిపోతుంది. చనిపోయే ముందు ఆమె గర్భవతిగా ఉంటుంది. ఒక లెటర్ రాసి అందులో ఆ వీడియో వైరల్ కాక పోయి ఉంటే నా జీవితం వేరేలా ఉండేదని రాసి ఉంటుంది. ఈ విషయం తలుచుకుని, ఎప్పుడూ బాధపడేవాడు యువన్. మా జీవితం ఇలా అయినందుకు ఆ వ్యక్తికి శిక్ష పడాలని అనుకుంటాడు యువన్. ఆ వీడియో వైరల్ చేసింది అరవింద్. అందుకనే అతని అతని భార్యని తన దగ్గరకు రప్పించి అరవింద్ కి కాల్ చేస్తాడు. చివరికి ఆ వ్యక్తి అరవింద్ భార్యని ఏం చేస్తాడు? యువన్ సూసైడ్ చేసుకుంటాడా? ఇంకెన్ని వీడియోలను అరవింద్ వైరల్ చేసి ఉంటాడు? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని చూడాల్సిందే.