OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలలో, హర్రర్ సినిమాలను చూడటానికి కొంతమంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ సినిమాలలో వచ్చే కొన్ని సీన్స్ వణుకు పుట్టిస్తాయి. అలా ఈ సినిమాలను చూస్తూనే బాగా థ్రిల్ అవుతారు మూవీ లవర్స్. అటువంటి థ్రిల్ అయ్యే మూవీ ఒకటి ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియోలో
ఈ హాలీవుడ్ హర్రర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘హనీమూన్‘ (Honeymoon). కొత్తగా పెళ్లయిన జంట హనీమూన్ కి వెళ్లడంతో, అక్కడ వీళ్లకు ఎదురయ్యే సంఘటనలతో మూవీ రన్ అవుతుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది. 2014లో విడుదల అయిన ఈ హనీమూన్ సూపర్‌నేచురల్ హారర్ మూవీలో, కొత్తగా పెళ్లయిన జంట పాత్రలో రోజ్ లెస్లీ, హ్యారీ ట్రెడ్‌వే నటించారు.
స్టోరీ లోకి వెళితే
హీరో, హీరోయిన్ లకు కొత్తగా పెళ్లవడంతో హనీమూన్ కి వస్తారు. వీళ్ళు వెళ్ళింది ఒక అడవి ప్రాంతం కావడంతో, బాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. అక్కడ హీరోయిన్ ఫాదర్ కి సంబంధించిన ఇల్లు కూడా ఉంటుంది. ఆ ప్రాంతంలో హీరోయిన్ ఫాదర్ ఎక్కువగా జంతువులని వేటాడేవాడు. ప్రస్తుతం వీళ్ళు ఆ ప్రాంతానికి హనీమూన్ కోసం వస్తారు. ఆ తరువాత అక్కడ కొంత దూరంలో ఉండే హోటల్ కి వెళ్తారు. అందులో విల్ అనే వ్యక్తి ఉంటాడు. ఆ హోటల్లో విల్ భార్య వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఈ జంటని చూసిన విల్ ఇప్పుడు ఈ హోటల్ రన్ కావట్లేదని చెప్తాడు. హీరోయిన్ కి అతడు ముందే తెలియడంతో, తన భార్య మానసిక పరిస్థితి బాగోలేదని చెప్తాడు. ఆ తర్వాత వీళ్ళు ఇంటికి వెళ్తారు. ఇంట్లో నిద్రిస్తున్నప్పుడు ఒక వెలుతురు హీరోయిన్ పై పడుతుంది. ఆమె నిద్రలో నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళిపోతుంది. హీరో లేచి చూసేసరికి హీరోయిన్ ప్రక్కన ఉండదు. హీరోయిన్ ని వెతుక్కుంటూ వెళ్ళిన హీరోకి ఆమె ఉన్న పరిస్తితి చూసి షాక్ అవుతాడు.
అక్కడ హీరోయిన్ ఒంటి మీద బట్టలు లేకుండా నిలబడి ఉంటుంది. ఆమెను హీరో అక్కడి నుంచి తీసుకుని లోపలికి వస్తాడు. ఏం జరిగిందో చెప్పమని అడుగుతాడు. హీరోయిన్ ఏమీ జరగలేదంటూ సమాధానం చెప్తుంది. హీరోయిన్ తొడ మీద ఎవరో కొరికినట్టు గాయం అవుతుంది. ఏదో దోమ కుట్టిందని హీరోయిన్ చెప్తుంది. అప్పటినుంచి హీరోయిన్ వింతగా ప్రవర్తిస్తుంది. దీనికి కారణం విల్ అనుకొని హీరో అతని దగ్గరకు వస్తాడు. చివరికి అక్కడ విల్ కనిపించడు. అతని దుస్తులు నదిలో పడిఉంటాయి. ఆ తరువాత హీరోకి ఊహించని సంఘటన ఎదురు అవుతుంది. చివరికి హీరోయిన్ అలా అవ్వడానికి ఎవరు కారణం? వీళ్ళ ఇంటికి వస్తున్న ఆ అదృశ్య మనిషి ఎవరు? వీళ్ళిద్దరూ అక్కడినుంచి ప్రాణాలతో బయటపడతారా? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ హారర్ మూవీని మిస్ కాకుండా చూడండి.