E-Paper
Advertisement

NBK 108 Movie Update : బాలయ్యతో అనీల్ ప్లానింగ్ సూపర్… అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

NBK 108 Movie Update : బాలయ్యతో అనీల్ ప్లానింగ్ సూపర్… అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి
Advertisement

NBK 108 Movie Update : నంందమూరి బాల‌కృష్ణ సినిమాలు చేయ‌టంలో అస్స‌లు స్పీడు తగ్గించ‌టం లేదు. ఓ వైపు వీర సింహా రెడ్డి విడుద‌ల‌కు స‌న్నద్ధ‌మ‌వుతుండ‌గానే త‌న NBK 108 సినిమా షూటింగ్‌ను షురూ చేసిన సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌ర్ మొద‌టి వారంలోనే అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య కొత్త సినిమాను స్టార్ట్ చేశారు. అది కూడా యాక్ష‌న్ పార్ట్‌తో. బాల‌య్య స్పీడుకి అనీల్ రావిపూడి ప్లానింగ్ తోడు కావ‌టంతో ఈ ఏడాది చివ‌రి రోజున అంటే డిసెంబ‌ర్ 31న NBK 108 ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్త‌య్యింది. వ‌చ్చే ఏడాదిలో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించ‌బోతున్నారు. ఈ విషయాన్ని అనీల్ రావిపూడి తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

NBK 108 ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కాగానే బాల‌కృష్ణ‌, అనీల్ రావిపూడి అండ్ టీమ్ కలిసి కేక్ క‌ట్ చేసి సెల‌బ్రేట్ చేసుకున్నారు. దానికి సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో ప్రియాంక జవాల్క‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అలాగే శ్రీలీల బాల‌య్య కుమార్తె పాత్ర‌లో న‌టించ‌నుంది. అలాగే బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ విల‌న్‌గా క‌నిపిస్తార‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది.

Advertisement

ప్ర‌స్తుతం బాల‌కృష్ణ త‌న 107వ సినిమా వీర సింహా రెడ్డి చిత్రాన్ని సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న విడుద‌లవుతుంది. అఖండ త‌ర్వాత బాల‌కృష్ణ చేస్తున్న సినిమా కావ‌టంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×