టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తల్లి అంజనాదేవి (Anjana Devi) అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. చికిత్స కోసం ఆమెను ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించగా.. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆమె చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఇకపోతే తల్లికి బాగో లేకపోవడంతో విజయవాడలో ఈరోజు జరగాల్సిన కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వాయిదా వేసుకుని, హుటాహుటిన హైదరాబాద్ కి బయలుదేరినట్లుగా తెలుస్తోంది. మరొకవైపు అటు రామ్ చరణ్ (Ram Charan) తమ సినిమా షూటింగ్లో బిజీగా ఉండగా.. వారు కూడా ఈ విషయం తెలుసుకొని హాస్పిటల్ కి వెళ్లిపోయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా నిన్న మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖ 45వ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుపుకోవాలని ప్రత్యేక ఫ్లైట్లో దుబాయ్ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకొని వారు కూడా బయలుదేరినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అంజనాదేవి ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అంజనాదేవి ఫ్యామిలీ..
కొణిదెల వెంకటరావు(Konidela venkata Rao) ను వివాహం చేసుకున్నారు అంజనా దేవి. వివాహం అనంతరం ఈ దంపతులకు ఐదు మంది సంతానం కాగా,మొదటి సంతానం చిరంజీవి (Chiranjeevi )కాగా , ఆ తర్వాత విజయ దుర్గ కొణిదెల, కొణిదెల మాధవి, కొణిదెల నాగేంద్రబాబు, కొణిదెల పవన్ కళ్యాణ్. ఇక వీరి వారసులు ఇండస్ట్రీలో చలామణి అవుతున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి – సురేఖ దంపతులకు ముగ్గురు సంతానం కాగా.. అందులో కొణిదెల సుశ్మిత నిర్మాతగా చలామణి అవుతోంది. ఇక కొడుకు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు అందుకున్నారు. శ్రీజ కొణిదల చిన్నమ్మాయి. ఈమెకు రెండుసార్లు వివాహమై ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది.
RC 16: రామ్ చరణ్ మూవీలో ప్రగ్యా జైస్వాల్.. నిజమేనా..?
మెగా ఫ్యామిలీ హీరోలు..
ఈ మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే రామ్ చరణ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఇలా పలువురు హీరోలు ఇండస్ట్రీలో చలామణి అవుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ కూడా త్వరలో ఇండస్ట్రీలోకి రాబోతున్నారు. ఇక అమ్మాయిల విషయానికి వస్తే.. మెగా ఫ్యామిలీలో చాలామంది అమ్మాయిలు ఉన్నప్పటికీ ఏ ఒక్కరు కూడా హీరోయిన్గా సినీ రంగ ప్రవేశం చేయలేదు. కానీ నాగబాబు కూతురు నిహారిక మాత్రం ‘ఒక మనసు’అనే సినిమాతో హీరోయిన్గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.కానీ ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత వివాహం చేసుకొని, అతడికి విడాకులు ఇచ్చి మళ్లీ నిర్మాణ సంస్థను స్థాపించి, ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా తీసి సక్సెస్ అయ్యింది. ఇక ఇప్పుడు కోలీవుడ్లో ఒక సినిమా చేసి అక్కడి ఆడియన్స్ ను తన నటనతో కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి అయితే అంజనాదేవి వంశవృక్షం చాలా పెద్దదే అని చెప్పవచ్చు.