Yuzvendra Chahal- Dhanashree Verma: టీమిండియా క్రికెట్ లో మరో కల్లోలం చోటు చేసుకుంది. టీమిండియా స్టార్ క్రికెటర్ విడాకులు తీసుకున్నాడు. ఇప్పటికే హార్దిక్ పాండ్యా అలాగే ఆయన భార్య నటాషా విడాకులు తీసుకోగా… ఇప్పుడు ఆ లిస్టులోకి టీమ్ ఇండియా బౌలర్ యుజ్వేంద్ర చాహల్ కూడా చేరిపోయాడు. గత కొన్ని రోజులుగా… టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal ) అలాగే ధన శ్రీ వర్మ ( Dhanashree Verma ) విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. 18 నెలల నుంచి వీరిద్దరూ దూరంగా ఉంటున్నారట. అలాగే సోషల్ మీడియాలో కూడా… ఒకరి ఫోటోలు మరొకరు డిలీట్ చేసినట్లు వార్తలు కూడా వైరల్ అయ్యాయి.
Also Read: India vs Bangladesh: నా లాగే క్యాచ్ మిస్.. రోహిత్ శర్మ అదిరిపోయే రియాక్షన్!
అయితే… తాజాగా యుజ్వేంద్ర చాహల్ అలాగే ధనశ్రీ వర్మ దంపతులు అన్నంత పని చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకులు తీసుకున్నారట యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal Divorce) అలాగే ధనశ్రీ దంపతులు. ఈ మేరకు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. యుజ్వేంద్ర చాహల్ అలాగే ధన శ్రీ వర్మ దంపతులకు గురువారం రోజున బాంద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసినట్లు చెబుతున్నారు.
అయితే చాహల్, ధన శ్రీ వర్మ విడాకులు గురువారం రోజున మంజూరు అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గురువారం రాత్రి టీమిండియా యంగ్ క్రికెటర్ చాహల్ సంచలన పోస్ట్ కూడా పెట్టాడు. నేను లెక్కించలేనన్నిసార్లు దేవుడు నన్ను రక్షించాడని ఈ సందర్భంగా పేర్కొన్నాడు చాహల్. ఆ సమయాలను ఊహించగలను కానీ అవేంటో నాకు తెలియవని ఆందోళన వ్యక్తం చేశారు చాహల్. ఆ సమయాలు ఎంతో పవిత్రమైనవి. ఇప్పుడు నాతో ఉన్న దేవుడికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ ఆమెన్ అని రాసుకొచ్చాడు. అయితే ఈ పరిస్థితులు ఏంటో వివరించలేదు కానీ… నిన్న విడాకుల గురించి చెప్పగానే చెప్పాడు చాహల్.
అయితే చాహల్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… నిజంగానే ధన శ్రీ వర్మ అలాగే యుజ్వేంద్ర చాహల్ ఇద్దరు విడిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దాదాపు 18 నెలల పాటు విడిగా ఉన్న ఈ ఇద్దరూ… విడాకులు తీసుకున్నారట. బాంద్రా ఫ్యామిలీ కోర్టులో.. టీమిండియా యంగ్ క్రికెటర్ చాహల్ అలాగే ఆయన సతీమణి ధనశ్రీ వర్మ ఇద్దరు కూడా.. ఫిజికల్ గా హాజరైనట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే… చాహల్, ధన శ్రీ వర్మ కేసును దాదాపు 45 నిమిషాల పాటు.. బాంద్రా ఫ్యామిలీ కోర్టు విచారణ చేసిందట.
గతంలోనే చాలా హియరింగ్లు జరిగినట్టు తగ్గుతున్నారు. అయితే ఇప్పుడు… విడాకులు మంజూరు చేసిందట బాంద్రా ఫ్యామిలీ కోర్టు. చాహల్ అలాగే ధన శ్రీ వర్మ ఇద్దరి ఇష్టం మేరకు… విడాకులు ఇచ్చిందట కోర్టు. అయితే ఈ వార్త బయటకు రావడంతో… దాదాపు 60 కోట్లు భరణంగా చాలా నుంచి ధన శ్రీ వర్మ డిమాండ్ చేసిందని కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఆ డబ్బుల కోసమే చాహల్ ను.. పెళ్లి చేసుకుందని కూడా ఆమెపై… ట్రోలింగ్ జరుగుతోంది.
Also Read: AFG vs SA: నేడు ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా మ్యాచ్..టైమింగ్స్ ఇవే
If a woman takes 60 crore just by getting married and then divorcing, how will people survive?
Dhanashree Verma married Yuzvendra Chahal only to gain fame and grab money. 💔#DhanashreeVerma #YuzvendraChahal #Divorced pic.twitter.com/eL2dt1QNSZ
— Harsh 17 (@harsh03443) February 21, 2025