Chiranjeevi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి (Chiranjeevi )150కి పైగా చిత్రాలు చేసి భారీ పాపులారిటీ అందుకున్నారు. ముఖ్యంగా తాను నటించిన ప్రతి సినిమాతో కూడా దాదాపుగా అప్పట్లో మంచి విజయం అందుకునేవారు. దీనికి తోడు ఆయన సినిమాలు రాబట్టే కలెక్షన్లతో రికార్డులు కూడా తిరగరాసేవారు. అందుకే మెగాస్టార్ గా చలామణి అవుతున్న చిరంజీవికి ఈమధ్య పెద్దగా సినిమాల ద్వారా బ్లాక్ బస్టర్ విజయాలు అందడం లేదు అని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే సినిమాల ద్వారా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోకపోయినా ఆయన రేంజ్ మాత్రం తగ్గడం లేదని సమాచారం. ముఖ్యంగా పెరిగిన ఆయన రెమ్యూనరేషన్ చూస్తే ఇది స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం..
అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోలు వీళ్లే..
ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా చలామణి అవుతున్న ప్రభాస్ (Prabhas), మహేష్ బాబు(Mahesh Babu),ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan), అల్లు అర్జున్ (Allu Arjun)వంటి వాళ్లు రూ.100 కోట్లు పారితోషకం తీసుకుంటూ అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలుగా చలామణీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ హీరోలతో రీజినల్ మూవీస్ తీసినా రూ.200 కోట్లు మినిమం వసూల్ చేస్తాయి..నాన్ థియేట్రికల్ రైట్స్ వంటివి అదనం అనే చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం వీళ్లంతా కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
స్టార్ డైరెక్టర్లకు సీనియర్ హీరోలే దిక్కా..
ఇకపోతే పవన్ కళ్యాణ్ మినహా మిగిలిన హీరోలంతా కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. కాబట్టి టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్లకి హీరోలు దొరకడం లేదు. ఈ క్రమంలో సీనియర్ స్టార్ హీరోలే వీళ్ళకి పెద్ద దిక్కులా మారిపోయారనటంలో సందేహం లేదు. అందుకే గతంలో కూడా ఎన్నడూ లేని విధంగా సీనియర్ హీరోలు కూడా రెమ్యూనరేషన్ పెంచేసి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ లిస్ట్ లోకి తాజాగా మెగాస్టార్ చిరంజీవి వచ్చి చేరారు. ప్రస్తుతం బింబిసారా దర్శకుడు వశిష్ట మల్లిడి (Vasista mallidi) దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. దీనికి దాదాపు రూ.60 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నారని, దానికి కూడా దాదాపు అంతే మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం.
పెరిగిన రెమ్యూనరేషన్..
అయితే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నాని(Nani)తో దసరా(Dasara )సినిమా చేసిన శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela)దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యారు చిరంజీవి. అయితే ఈ సినిమా కోసం ఏకంగా రూ.75 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాను నిర్మించడానికి సుధాకర్ చెరుకూరి ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా కథ ‘విక్రమ్’ రేంజ్ లో ఉంటుందని, నాని కూడా ఈ సినిమాకి ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. కానీ వాయిదా పడింది.ఇక మే నెలలో ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.