Bollywood:కొంతమంది హీరోయిన్లు ఎన్ని సినిమాలు తీసినా.. ఎన్ని సినిమాల్లో నటించినా.. అస్సలు గుర్తింపు తెచ్చుకోరు. ఇక మరి కొంతమంది హీరోయిన్లు నటించిన ఒకటి రెండు సినిమాలతోనే ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ పొందుతారు. ఇంకొంతమంది హీరోయిన్స్ అయితే ఓవర్ నైట్ లో స్టార్స్ అయిపోతారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ కూడా ఒకరు. అప్పటివరకు ఈ హీరోయిన్ ని ఎవరూ అంతగా పట్టించుకోలేదు. కానీ ఒకే ఒక్క సినిమాతో బాక్సాఫీస్ ని షేక్ చేసి ఇండియన్ హిస్టరీలో హీరోయిన్ గా ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. అయితే ఈ హీరోయిన్ ఆ ఒక్క సినిమా కోసం సిగరెట్ తాగడం కూడా నేర్చుకొని చివరికి చైన్ స్మోకర్ గా మారింది. కట్ చేస్తే..ఈ హీరోయిన్ కష్టానికి ఫలితంగా నేషనల్ అవార్డు కూడా వచ్చింది.
తెలుగు ప్రేక్షకులకు పరిచయమే..
మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే విద్యాబాలన్ (Vidhyabalan).. బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ అంటే సౌత్ ఇండస్ట్రీలో ఉండే సినీ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలు. ఎందుకంటే ఈమె తెలుగులో బాలకృష్ణ (Balakrishna) హీరోగా చేసిన సీనియర్ ఎన్టీఆర్ (Sr.NTR)బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు వంటి సినిమాల్లో సీనియర్ ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో మెరిసింది.అలా సౌత్ ప్రేక్షకులకు కూడా ఈ ముద్దుగుమ్మ పరిచయమైంది. అయితే అలాంటి ఈ హీరోయిన్ 2011లో విడుదలైన “ది డర్టీ పిక్చర్” మూవీతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన సంగతి మనకు తెలిసిందే.అప్పటివరకు విద్యాబాలన్ కి అంత గుర్తింపు లేదు.కానీ ఎప్పుడైతే సిల్క్ స్మిత బయోపిక్ గా తెరకెక్కిన ది డర్టీ పిక్చర్ సినిమాలో నటించిందో అప్పటినుండి ఈ ముద్దుగుమ్మకి మంచి గుర్తింపు లభించింది.
ది డర్టీ పిక్చర్ కోసం ఏకంగా 12 కిలోలు బరువు పెరిగిన హీరోయిన్..
2011లో విడుదలైన ది డర్టీ పిక్చర్ సినిమా విద్యాబాలన్ నటనను సినీ ఇండస్ట్రీకి తెలిసేలా చేసిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో నటించే ముందు తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా ఈ సినిమాలో నటించకూడదు అని చెప్పారట. కానీ ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా విద్య బాలన్ సిల్క్ స్మిత బయోపిక్ గా వచ్చిన ది డర్టీ పిక్చర్ మూవీలో నటించి మంచి మార్కులు వేయించుకుంది. అయితే ఈ సినిమా కంటే ముందు విద్యాబాలన్ సన్నగా కరెంట్ తీగలా ఉండేది. కానీ ఈ సినిమా కోసం ఏకంగా 12 కిలోల బరువు పెరిగింది.ఎందుకంటే సిల్క్ స్మిత కాస్త లావుగా ఉంటుంది. కాబట్టి ఆమె పాత్ర కోసం లావవ్వడం కోసం ఎక్కువ ఫ్యాట్ ఉండే ఆహార పదార్థాలు తీసుకొని లావు పెరిగింది. అలాగే సిల్క్ స్మిత సిగరెట్ తాగేది.అలా సిగరెట్ తాగే సన్నివేశాల్లో నటించాలంటే సిగరెట్ అలవాటు ఉండాలి అని, సిగరెట్ తాగినట్టు నటించడం కాకుండా రియల్ గా సిగరెట్ తాగడం నేర్చుకొని ఆ సన్నివేశాలలో బాగా నటించింది.
చైన్ స్మోకర్ గా మారిన విద్యాబాలన్..
ఇక సినిమా షూటింగ్ అయిపోయాక కూడా సిగరెట్ తాగడం అలవాటైపోయి చైన్ స్మోకర్ గా మారింది. ఆ తర్వాత సిగరెట్ తాగడం వ్యసనంగా మారడంతో దాని నుండి బయటపడడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిందట. అయితే ప్రస్తుతం ఆమె పూర్తిగా సిగరెట్ మానింది. ఇక సిల్క్ స్మిత బయోపిక్ గా తెరకెక్కిన ది డర్టీ పిక్చర్ మూవీ రూ. 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద రూ.120 కోట్ల వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక ఈ సినిమాతో ఈమెకు నేషనల్ అవార్డు రావడమే కాకుండా 2014లో పద్మశ్రీ అవార్డు కూడా విద్యాబాలన్ ని వరించింది. ఇక 46 ఏళ్ళున్న విద్యాబాలన్ ఇంకా యంగ్ గానే కనిపిస్తుంది. ఇక విద్యాబాలన్ నటించిన భూల్ భూలయ్యా -3 గత ఏడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది.