బుధవారం RRR సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ అవార్డుని దక్కించుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి. ఎంటైర్ ఇండియా ఈ హ్యాపీ మూమెంట్‌ను సెలబ్రేట్ చేసుకుంది. RRR టీమ్‌ని ప్రశంసలతో ముంచెత్తింది. అయితే ఒకరు మాత్రం ట్రోలింగ్‌కి గురయ్యారు. అదెవరో కాదు.. అల్లు అర్జున్ సోదరుడు, హీరో అల్లు శిరీష్. ఇంతకీ ఈ అల్లు బ్రదర్‌ని నందమూరి అభిమానులు ఎందుకు టార్గెట్ చేశారో తెలుసా? వివరాల్లోకి వెళితే..
RRRకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సంగతి తెలిసింది. సినీ, రాజకీయ ప్రముఖులు RRR టీమ్‌ను ప్రశంసిస్తున్నారు. ఇదే క్రమంలో అల్లు శిరీష్ కూడా RRR టీమ్‌కు అభినందనలు తెలియజేశారు. అలా తెలియజేస్తున్నప్పుడు రామ్ చరణ్, ఎస్.ఎస్.రాజమౌళి, ఎం.ఎం.కీరవాణి, RRR మూవీ ట్విట్టర్ హ్యాండిల్స్‌ను అల్లు శిరీష్ ట్యాగ్ చేశారు కానీ.. ఎన్టీఆర్ ట్విట్టర్ హ్యాండిల్ ట్యాగ్ చేయలేదు. తెలియక చేశాడో లేక తెలిసే చేశాడో మనకు తెలియదు కానీ తప్పు జరిగిపోయింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు శిరీష్‌ని బూతులు తిడుతున్నారు. అందరి ట్విట్టర్స్ హ్యాండిల్స్ ట్యాగ్ చేసిన తారక్‌ని ఎలా మరచిపోతావని అంటున్నారు. అంత ఇన్‌సెక్యూరిటీ ఎందుకని తిట్టి పోస్తున్నారు. మరి దీనిపై అల్లు శిరీష్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి మరి.