BigTV English

Women’s Day : తల్లిపై చిరంజీవి ఎమోషనల్ వీడియో… అది వింటే కన్నీళ్లు ఆగవు అంతే..

Women’s Day : తల్లిపై చిరంజీవి ఎమోషనల్ వీడియో… అది వింటే కన్నీళ్లు ఆగవు అంతే..

Women’s Day : టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో ఉన్న నాలుగు ఫ్యామిలీలల్లో ముందుగా వినిపించేది చిరంజీవి ఫ్యామిలీనే.. ఈ కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఎంత ఎత్తు ఎదిగినా కూడా తల్లి అంటే ఇంత కూడా ప్రేమ తగ్గలేదు. తన తల్లి అంజనాదేవీ అంటే చిరంజీవికి ఎంత ఇష్టమో అందరికి తెలుసు.. ఆమెతో ఇప్పటికి చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తారు. ఇటీవల ఆమె పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా నిర్వహించారు. తాజాగా ఉమెన్స్ డే స్పెషల్ గా ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో తన తల్లి గురించి ప్రతి విషయాన్ని షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..


అంజనమ్మ పై చిరంజీవి వీడియో.. 

తల్లి గురించి చిరంజీవి ఎప్పుడు ప్రస్తావిస్తూ ఉంటాడు. తన తల్లి బిడ్డల కోసం ఎంత కష్టపడిందో ఇప్పుడు ఈ స్థాయిలో మేము ఉండడానికి ఆమె పడ్డ కష్టం గురించి ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.. ఒక సామాన్య మధ్యతరగతి గృహిణి గా ఆమె పిల్లలకు నేర్పిన సంస్కారం, క్రమశిక్షణ నేడు ఎంతోమందికి ఆపదలో ఉన్నప్పుడు సహాయం అందించే చెయ్యి గా నిల్చింది. అంతే కాకుండా మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ని చూసి ప్రపంచం మొత్తం గర్వించదగ్గ వారసులను మన తెలుగు సినిమాకి అందించి ఎనలేని పుణ్యాన్ని మూటగట్టుకుంది.. ఇటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా కూడా కష్టాన్ని నమ్ముకుని ఇండస్ట్రీలో ఇప్పుడు మెగాస్టార్ గా పిలిపించుకున్నాడు చిరంజీవి. అటు రెండో కుమారుడు నాగబాబు కూడా సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ఇక చిన్న కుమారుడు పవన్ కళ్యాణ్ ఏకంగా డిప్యూటీ సీఎం గా బాధ్యతలను నిర్వర్థిస్తున్నారు.. ఆమె నేర్పిన ఆ సంస్కారం ఇప్పుడు కొడుకులను ఈ స్థాయిలో నిలబడేలా చేసింది. అందుకే తన్నుంటే ఆ కొడుకులకు జనాలేని ప్రేమ ఇప్పటికీ అమ్మను గౌరవిస్తూనే ఉంటారు.


ఉమెన్స్ డే స్పెషల్ వీడియో.. 

ఉమెన్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన తల్లి గురించి ఆమె పడ్డ కష్టం గురించి స్పెషల్ వీడియోని రెడీ చేశారు. ఆ వీడియోకు సంబందించిన ఒక క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో చిరంజీవి మాట్లాడుతూ.. మా కోసం మా తల్లి ఎంత కష్టపడిందో చూసాము. తానుబడ్డ కష్టమే ఈరోజు మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టింది అంటూ తల్లి గురించి చెప్తూ చిరంజీవి ఎమోషనల్ అయ్యాడు. అలాగే నాగబాబు తన తల్లి కౌగిలే తనకు ధైర్యం అంటూ తల్లిబడ్డ కష్టాల గురించి తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. చిరంజీవి చెల్లెలు ఇద్దరు కూడా తమ తల్లి గురించి గొప్పగా చెప్పారు. అంజనాదేవీ పిల్లలకు నేర్పిన సంస్కారం మెగా ఫ్యామిలీకి పిల్లర్స్ గా మారింది. ఇక ఉమెన్స్ డే స్పెషల్ గా తయారు చేసిన వీడియో రేపు సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యనున్నారు..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×