Mitchell Santner: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 Tournament )… ఫైనల్ మ్యాచ్ ఆదివారం రోజున జరగబోతున్న నేపథ్యంలో అందరూ ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటి నుంచి ఆదివారం ఎలాంటి పని పెట్టు కోకుండా ఫైనల్ మ్యాచ్ మాత్రమే చూసేలా… టీమిండియా అభిమానులు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో… దుబాయ్ పిచ్ పైన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ( Mitchell Santner ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దుబాయ్ పిచ్ పూర్తిగా టీమ్ ఇండియాకు అనుకూలంగా ఉంటుందని బాంబు పేల్చాడు.
Also Read: IND VS NZ: CT ఫైనల్ టై అయితే విజేత ఎవరు..? సూపర్ ఓవర్ ఆడాల్సిందేనా..?
వాళ్లు దాదాపు 20 రోజుల నుంచి అక్కడే… ఆడుతున్నారు.. వాళ్లకు దుబాయ్ పిచ్ పూర్తిగా అలవాటు అయిపోయిందని విషం కక్కాడు న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ( Mitchell Santner ). టీమిండియా కు అక్కడి పిచ్ పూర్తిగా అర్థం అయిందని… వాళ్లు ఈజీగా గెలిచే ఛాన్స్ ఉంటుందని కూడా పేర్కొన్నాడు. అందుకే సులభంగా ఫైనల్ వరకు వచ్చినట్లు పరోక్షంగా వ్యాఖ్యానించాడు న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్. తొలి సెమీ ఫైనల్ లో టీమిండియా పైన మేము ఓడిపోయాం.. అప్పుడు టీమిండియాను బలంగానే ఢీకొట్టాం.. అని వ్యాఖ్యానించాడు. మా కుర్రాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు… ఫైనల్ మ్యాచ్లో కచ్చితంగా గెలుస్తామని కూడా ప్రకటించాడు న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్.
అయితే న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ చేసిన వ్యాఖ్యలపై… టీమిండియా మాజీ క్రికెటర్లు ఫైర్ అవుతున్నారు. టీమిండియా దుబాయ్ పిచ్ ను నమ్ముకోలేదని…. కేవలం టాలెంట్ మాత్రమే నమ్ముకుందని ఈ కౌంటర్ ఇస్తున్నారు. టీమిండియా వరుసగా టాలెంట్ తో మ్యాచులు గెలిచిందని గుర్తు చేస్తున్నారు. అనవసరంగా టీమిండియా పై ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు విషం కక్కుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీమిండియా మాజీ క్రికెటర్లు.
Also Read: ICC CT 2025 – IPL 2025: ఫైనల్స్ కెప్టెన్లు ఇద్దరు… హార్దిక్ పాండ్యా కింద ఆడాల్సిందే ?
టీమిండియా ఫైనల్ లో గెలిస్తే ఇంకా విష ప్రచారం పెంచుతారని.. ఇప్పటినుంచి హెచ్చరిస్తున్నారు. టాలెంట్ ఉన్నవాడు మాత్రమే మ్యాచులు గెలుస్తాడని… చేతకాని వాళ్లంతా ఇలా సోది చెబుతారని.. సెటైర్లు పేల్చుతున్నారు. ఇది ఇలా ఉండగా…. టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( Team India vs New Zealand ) మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్… ఆదివారం రోజున.. మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ మధ్యాహ్నం రెండు గంటలకు ఉంటుంది. ఇక చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన లైవ్ స్ట్రీమింగ్ జియో హాట్ స్టార్ ద్వారా మనం చూడవచ్చు. జియో హాట్ స్టార్ లో ఉచితంగానే మనకు ప్రసారాలు అవుతున్నాయి. అలాగే స్పోర్ట్స్ 18 తో పాటు… స్టార్ స్పోర్ట్స్ లో కూడా మ్యాచ్ చూడవచ్చు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్… ఫైనల్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.