BigTV English

Megastar Chiranjeevi : శ్రీకాంత్ కంటే అనిల్ ముందు

Megastar Chiranjeevi : శ్రీకాంత్ కంటే అనిల్ ముందు

Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని శాసిస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. దాదాపు 10 ఏళ్ల పాటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చినా కూడా మళ్ళీ మెగాస్టార్ రీ ఎంట్రీ తో రికార్డ్స్ మొత్తం గల్లంతయిపోయాయి. వివి వినాయక దర్శకత్వంలో వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేసుకుంటూ ఇప్పటికీ కూడా అదే ఫామ్ లో చాలామంది యంగ్ హీరోస్ కంటే కూడా మెగాస్టార్ చిరంజీవి చాలా హార్డ్ గా కష్టపడుతున్నారు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి యంగ్ దర్శకులతో సినిమాలు చేయడం మొదలుపెట్టారు. ఇకపోతే మెగాస్టార్ రీసెంట్రీ తర్వాత బాబి దర్శకత్వం వహించిన వాల్తేరు వీరయ్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయం సాధించింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమాకి సరైన రేటింగ్ రాకపోయినా కూడా కలెక్షన్లు మాత్రం అద్భుతంగా వచ్చాయి.


ఒక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుసగా యంగ్ డైరెక్టర్ తో సినిమాలు చేయడం మొదలుపెట్టారు. రీసెంట్ గానే దసరా దర్శకుడు శ్రీకాంత్ తో సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను నాచురల్ స్టార్ నాని ప్రజెంట్ చేస్తున్నారు. ఈ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేయగానే అందరికీ అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. శ్రీకాంత్ మొదటి సినిమాతోనే దర్శకుడుగా తన ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. నాని కెరియర్ కు హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చే సినిమాను ఇచ్చాడు. ఇక ప్రస్తుతం శ్రీకాంత్ నానితోనే మరో సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకు పారడైజ్ అనే సినిమా టైటిల్ ఖరారు చేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కేవలం శ్రీకాంత్ తో మాత్రమే కాకుండా అనిల్ రావిపూడి తో కూడా సినిమాను చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి శ్రీకాంత్ సినిమా కంటే ముందు అనిల్ రావిపూడితో మెగాస్టార్ చిరంజీవి సినిమా మొదలుకానున్నట్లు సమాచారం.

అనిల్ రావిపూడి విషయానికి వస్తే. పటాస్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు అనిల్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. ఇప్పటివరకు అనిల్ రావిపూడి కెరియర్లో డిజాస్టర్ అయిన సినిమా ఒకటి కూడా లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి హీరోతో కూడా సినిమా చేసి సక్సెస్ కొట్టాడు అనిల్. ఇక ప్రస్తుతం వరుసగా సీనియర్ హీరోలతో అనిల్ సినిమాలు చేస్తున్నాడు. వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను చేస్తున్నాడు అనిల్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ సినిమా చేయబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.


Also Read : Bellamkonda Srinivas: పెళ్లిపీటలు ఎక్కబోతున్న మరో కుర్ర హీరో.. వధువు ఎవరంటే.. ?

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×