Bellamkonda Srinivas: ఇండస్ట్రీలో ఈ ఏడాది చాలామంది సెలబ్రిటీలు పెళ్లిపీటలు ఎక్కేస్తున్నారు. ముఖ్యంగా కుర్ర హీరో, హీరోయిన్లు తమ బ్యాచిలర్ లైఫ్ కు బైబై చెప్పి.. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. నేడు అక్కినేని నాగ చైతన్య వివాహం జరుగుతున్న విషయం తెల్సిందే. అంతేకాకుండా అఖిల్ కూడా ఎంగేజ్ మెంట్ చేసుకొని పెళ్ళికి రెడీ అవుతున్నాడు. వీరితో పాటు హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన ప్రియుడితో పెళ్లి అనౌన్స్ చేసింది. త్వరలోనే ఆమె వివాహం జరగనుంది. ఇక ఈ ఏడాదిలోనే హీరోయిన్ మేఘా ఆకాష్, హీరో శ్రీసింహా సైతం వివాహాలు చేసుకొని సెటిల్ అయ్యారు. వీరి లిస్ట్ లోనే ఇంకో కుర్ర హీరో కూడా చేరిపోయాడు.
తాజాగా టాలీవుడ్ కుర్ర హీరో బెల్లంకొండ సురేష్ కూడా పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడుగా అల్లుడు శ్రీను అనే సినిమాతో శ్రీనివాస్ వెండితెరకు పరిచయమయ్యాడు. ఒక స్టార్ హీరో కొడుకు ఎంట్రీకి కూడా అంత ఖర్చుపెట్టి ఉండరు. కానీ, శ్రీనివాస్ టాలీవుడ్ ఎంట్రీ నెక్స్ట్ లెవెల్లో ఇచ్చాడు.
మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న శ్రీనివాస్ ఆ తరువాత స్పీడున్నోడు, జయ జానకి నాయక, సాక్ష్యం, కవచం, సీత, రాక్షసుడు, అల్లుడు అదుర్స్ లాంటి సినిమాలు చేశాడు. విజయాపజయాలను లెక్కచేయకుండా సినిమాలు చేసుకుంటూ వస్తున్న శ్రీనివాస్.. బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చాడు. ప్రభాస్ – రాజమౌళి కాంబోలో వచ్చిన భారీ బ్లాక్ బస్టర్ మూవీ ఛత్రపతి.. హిందీ రీమేక్ లో శ్రీనివాస్ నే హీరోగా నటించాడు. ఈ సినిమా కూడా బాబుకు ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
Pushpa 2 : పుష్ప చిరిగింది… పవన్ అడ్డాలో అలజడి
ఇక గత కొంత కాలంగా శ్రీనివాస్ ఒక మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా తెరకెక్కుతున్న స్టూవర్టుపురం దొంగ, టైసన్ నాయుడు, భైరవం.. ఈ మూడు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. శ్రీనివాస్ త్వరలోనే పెళ్లికొడుకుగా మారబోతున్నాడు. ఈ విషయాన్నీ ఆయన తండ్రి సురేష్ మీడియా ముందు చెప్పుకొచ్చాడు.
సురేష్ నిర్మాతగా మారి 25 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. అందులో తన ఇద్దరు కొడుకుల పెళ్లి గురించి టాపిక్ రావడంతో.. పెద్దబ్బాయి శ్రీనివాస్ పెళ్లి త్వరలో ఉంటుంది. చిన్నబ్బాయి గణేష్ కు ఇంకా సమయం ఉంది అని చెప్పుకొచ్చాడు.
Keerthy Suresh: కొత్తగా ముస్తాబయిన కాబోయే పెళ్లికూతురు కీర్తి సురేశ్..
అంతేకాకుండా శ్రీనివాస్ పెళ్లి పెద్దలు కుదిర్చిన సంబంధమే అని, అమ్మాయికి, ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. వ్యాపార రంగంలో స్థిరపడ్డ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిగా ఆయన చెప్పుకొచ్చారు. దీంతో త్వరలోనే వీరి పెళ్లి ఘనంగా జరగనుందని తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో అభిమానులు బెల్లంకొండ శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి పెళ్లి తరువాత శ్రీనివాస్ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.