BigTV English

Vishwambhara: ‘విశ్వంభర ‘ రిలీజ్ డేట్ లాక్.. ఎప్పుడంటే..?

Vishwambhara: ‘విశ్వంభర ‘ రిలీజ్ డేట్ లాక్.. ఎప్పుడంటే..?

Vishwambhara.. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం యంగ్ డైరెక్టర్లను లైన్ లో పెడుతూ వరుస విజయాలు సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే కళ్యాణ్ రామ్(Kalyan Ram) తో ‘బింబిసారా’ సినిమా చేసి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ప్రముఖ యంగ్ డైరెక్టర్ వశిష్ట మల్లిడి (Vassista Mallidi) దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా విజువల్ వండర్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాను మరింత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దడానికి ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin)తన టీం తో కలిసి వీఎఫ్ఎక్స్ వర్క్ కోసం పనిచేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమాలో అలనాటి స్టార్ హీరోయిన్ త్రిష (Trisha), అలాగే యంగ్ బ్యూటీ ఆషిక రంగనాథ్ (Ashika Ranganath) హీరోయిన్లుగా నటిస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తూ ఉండడం గమనార్హం.


క్యూరియాసిటీ పెంచిన పోస్టర్స్.. కానీ..

ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగు ప్రారంభం అయ్యి ఏడాదికి పైగానే అవుతున్నా.. కేవలం పోస్టర్స్ మాత్రమే విడుదల చేసి క్యూరియాసిటీ పెంచుతున్నారు. కానీ ఈ సినిమాకు సంబంధించి ఏ అప్డేట్ విడుదల కాకపోవడంతో అభిమానులు సైతం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది.. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ALSO READ:Abhinaya: ఎట్టకేలకు నిశ్చితార్థం చేసుకున్న అభినయ.. పెళ్లి ఎప్పుడంటే..?

వైరల్ గా మారిన విశ్వంభర రిలీజ్ డేట్స్..

అసలు విషయంలోకి వెళితే.. ఈ సినిమా విడుదల చేయడానికి రెండు డేట్స్ ని చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి 2025 మే 9 సమ్మర్ హాలిడేస్ సందర్భంగా బాస్ ఎంట్రీ ఇచ్చి దుమ్ము లేపబోతున్నాడని వార్తలు రాగా.. మరొకవైపు ఆగస్టు 22వ తేదీ అని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ డేట్ చిరంజీవికి చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఆ రోజు పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి బర్త్డే కావడం గమనార్హం. స్పెషల్ డే రోజున విశ్వంభర సినిమాను రిలీజ్ చేస్తే బాగుంటుందని, కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అటు మేకర్స్ కూడా భావిస్తున్నారు. మరి ఈ రెండింటిలో ఏది ఫిక్స్ చేస్తారో తెలియదు కానీ ప్రస్తుతం ఈ రెండు డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి బాస్ వచ్చే టైం ఎప్పుడూ అనే విషయంపై క్లారిటీ రావాలి అంటే చిత్ర బృందం అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. మొత్తానికి అయితే విజువల్ వండర్ గా రాబోతున్న విశ్వంభర సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×