IND VS NZ Final: చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ( Champions Trophy 2025 tournament final ) జరుగుతున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా ( New Zealand vs Team India ) మధ్య దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న న్యూజిలాండ్ జట్టు… భారీ స్కోర్ ఏం చేయలేదు. నిర్ణిత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ జట్టు… 251 పరుగులు మాత్రమే చేయగలిగింది. టాప్ ఆర్డర్ న్యూజిలాండ్ ప్లేయర్లు దారుణంగా విఫలం కావడంతో… తక్కువ స్కోరు చేసింది. అయితే మిడిల్ ఆర్డర్ లో వచ్చిన… డారైల్ మిచెల్, ఫిలిప్స్, బ్రేస్ వెల్ కాస్త రాణించారు.
Also Read: IND VS NZ Final: వరుసగా రెండు క్యాచ్ లు మిస్… గ్రౌండ్ నుంచి వెళ్లిపోయిన షమీ..!
అయితే మిగిలిన ఆటగాళ్లు అందరినీ… టీమిండియా స్పిన్నర్లు ముప్ప తిప్పలు పెట్టారు. అసలు టీమిండియా బౌలింగ్లో ఆడేందుకు… గజ గజ వణికిపోయారు న్యూజిలాండ్ ఆటగాళ్లు. ముఖ్యంగా రచిన్ రవీంద్ర, డేంజర్ ఆటగాడు కేన్ విలియమ్సన్ లాంటి ప్లేయర్ల వికెట్లను కుల్దీప్ యాదవ్… తొందరగానే పడగొట్టడం జరిగింది. దీంతో న్యూజిలాండ్ పెద్ద స్కోర్ చేయలేకపోయింది. వీళ్ళిద్దరి వికెట్లు తీసిన తర్వాత… రవీంద్ర జడేజా, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చాలా చక్కగా బౌలింగ్ చేశారు. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఫాస్ట్ బౌలర్లు హార్దిక్ పాండ్యా అలాగే మహమ్మద్ షమీ పెద్దగా వికెట్లు తీయలేకపోయారు. స్పిన్నర్లు ఆదుకోవడంతో టీమిండియా బతికి బయటపడింది.
Also Read: IND VS NZ Final: టీమిండియా గెలవాలని వేడి వేడి మూకుడులో కూర్చున్న బుడ్డోడు !
అయితే ఇవాల్టి మ్యాచ్ లో టీమిండియా ఫిల్టర్లు.. దారుణంగా విఫలమయ్యారు. దాదాపు 7 నుంచి 8 క్యాచ్లు మిస్ చేశారు టీమిండియా ఆటగాళ్లు. రోహిత్ శర్మ నుంచి మొదలుకొని… శ్రేయస్ అయ్యర్ వరకు… అందరూ క్యాచ్ లు మిస్ చేశారు. ఆ క్యాచులు పట్టి ఉంటే… న్యూజిలాండ్ 200 కూడా కొట్టలేకపోయేది. ఇది ఇలా ఉండగా… న్యూజిలాండ్ ఆటగాలలో విల్ యంగ్ 15 పరుగులు చేయగా.. రచిన్ రవీంద్ర 37 పరుగులతో రాణించాడు. కేన్ మామ 11 పరుగులు చేయగా… మిచెల్ 63 పరుగులతో దుమ్ము లేపాడు. ఆ న్యూజిలాండ్ వికెట్ కీపర్ లాతం 14 పరుగులు చేయగా.. ఫిలిప్స్ 34 పరుగులు చేశాడు. మైఖేల్ బ్రేస్‌వెల్ 53 పరుగులు చేసాడు. అటు టీమ్ ఇండియా బౌలర్లలో… వరుణ్ చక్రవర్తి అలాగే కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా ఒక్క వికెట్ పడగొట్టాడు. షమీ ఒక వికెట్ తీసాడు. ఈ మ్యాచ్ లో అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా ఒక్క వికెట్ కూడా… తీయలేకపోయారు. ఇవాల్టి మ్యాచ్ లో మూడు ఓవర్లు వేసిన హార్దిక్ పాండ్యా 30 పరుగులు ఇచ్చాడు. ఇక ఈ మ్యాచ్ లో నిర్ణీత 50 ఓవర్లలో 252 పరుగులు చేస్తే.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ గెలుచుకోవచ్చు టీమిండియా. మరి కాసేపట్లోనే టీమిండియా ఇన్నింగ్స్ కూడా ప్రారంభం కానుంది. మరి రోహిత్ శర్మ సేన ఎలా ఆడుతుందో.