Abhinaya.. ప్రముఖ నటి అభినయ (Abhinaya) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ‘శంభో శివ శంభో’, ‘ధృవ’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఈమె.. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు. ఇకపోతే ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రహస్యంగా నిశ్చితార్థం చేసుకొని, ఆ తర్వాత ఆ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది. ఇక దీని బట్టి చూస్తే త్వరలోనే ఈ ముద్దుగుమ్మ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అభినయ తన కాబోయే భర్తతో కలిసి గుడిలో గంట కొడుతున్న ఫోటోని షేర్ చేస్తూ ఎంగేజ్మెంట్ విషయాన్ని అభిమానులతో పంచుకుంది.
నిశ్చితార్థం చేసుకున్న ప్రముఖ నటి అభినయ..
అభినయ తనకు నిశ్చితార్థమైన విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ..”మా ప్రయాణం నేటితో ప్రారంభం అయ్యింది” అంటూ రాసుకుంది. ఇకపోతే తనకు కాబోయే భర్త ముఖాన్ని మాత్రం ఆమె చూపించలేదు. అలాగే అతడి వివరాలు కూడా ఆమె వెల్లడించలేదు. మరొకవైపు ఆమెకు నటీనటులు, నెటిజన్లు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే ఈ విషయం తెలిసి గత 15 సంవత్సరాలుగా తాను ఒక వ్యక్తి ప్రేమలో ఉన్నానంటూ ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. అందుకు తగ్గట్లే ఇప్పుడు నిశ్చితార్థం చేసుకుంది. కాకపోతే కాబోయే భర్త ముఖం కానీ అతని వివరాలు కానీ ఏవి బయట పెట్టలేదు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం అభినయ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.
ALSO READ:Chiranjeevi: యంగ్ బ్యూటీ శ్రీ లీలాకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి..
అభినయ కెరియర్..
అభినయ.. మోడల్గా కెరియర్ ఆరంభించిన ఈమె.. అందంతో పాటు అందానికి తగ్గ ప్రతిభతో ఎంతోమంది హృదయాలను దోచుకుంది. వాస్తవానికి ఈమె చక్కని ప్రతిభావంతురాలైనా.. పుట్టుకతోనే మూగది.. పైగా వినలేదు కూడా.. అయినా సరే పట్టుదలతో సాధించి నేడు స్టార్ సెలబ్రిటీగా పేరు దక్కించుకుంది. 2009లో వచ్చిన ‘నాదోదిగల్’ అనే చిత్రంతో సినిమా రంగ ప్రవేశం చేసిన అభినయ.. ఆ తర్వాత తెలుగు, కన్నడ చిత్రాలలో ప్రముఖ పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంది. ఈమె తండ్రి 2006 లో ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహించిన తెలుగు సినిమా ‘స్టాలిన్’ లో సెక్యూరిటీ ఆఫీసర్ పాత్ర పోషించారు. ఇక అభినయ తనతో పాటు కలిసి నటించడం గమనించిన తండ్రి ఈమెను ఎం.శశి కుమార్ కి పరిచయం చేయగా.. ఆయన నాదోదిగల్ అనే సినిమా ద్వారా ఈమెను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇక తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు అభినయ. ఇక తన నటనతో పలు ఫిలింఫేర్ అవార్డులను సొంతం చేసుకున్న ఈమె.. ఉత్తమ సహాయ నటిగా కూడా అవార్డు అందుకుంది. తెలుగు , తమిళ్, కన్నడ, మలయాళం మాత్రమే కాదు హిందీలో కూడా నటించింది అభినయ. అలాగే ‘మాన్షన్ 24’ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఇక ఇప్పుడు ఎట్టకేలకు నిశ్చితార్థం చేసుకుని త్వరలోనే పెళ్లికి సిద్ధం కాబోతోందని సమాచారం.