BigTV English

Chiranjeevi : అయోధ్య రాముడికి హనుమాన్ విరాళం.. ఎంతంటే?

Chiranjeevi : అయోధ్య రామమందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘హను-మాన్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందిందని ఆయన తెలిపారు. జనవరి 22న కుటుంబసభ్యులతో కలిసి అయోధ్యకు వెళ్తానని వెల్లడించారు. మరోవైపు, రామమందిర ప్రారంభోత్సవ వేళ ‘హను-మాన్‌’ చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

Chiranjeevi : అయోధ్య రాముడికి హనుమాన్ విరాళం.. ఎంతంటే?

Chiranjeevi : అయోధ్య రామమందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘హను-మాన్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందిందని ఆయన తెలిపారు. జనవరి 22న కుటుంబసభ్యులతో కలిసి అయోధ్యకు వెళ్తానని వెల్లడించారు. మరోవైపు రామమందిర ప్రారంభోత్సవ వేళ ‘హను-మాన్‌’ చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.


ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా కీలక పాత్రలో నటించిన హనుమాన్ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుందని తెలిపారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. ఈ సినిమా ప్రతి టికెట్‌పై రూ.5 అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇవ్వనున్నట్లు చిత్ర బృందం తీసుకున్న నిర్ణయాన్ని చిరంజీవి అభినందించారు.

హనుమాన్ సినిమా ఈవెంట్‌కు రావడానికి కొన్ని కారణాలున్నాయని చిరంజీవి తెలిపారు. నా ఆరాధ్య దైవం, అమ్మానాన్నల తర్వాత అనుక్షణం ప్రార్థించే వ్యక్తి ఆంజనేయస్వామి అన్నారు. ఆయనను ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని తీసిన సినిమా కాబట్టి వచ్చానని చిరంజీవి తెలిపారు. డైపర్లు వేసుకునే స్థాయి నుంచి డయాస్‌లు ఎక్కే స్టేజ్‌కు వచ్చిన తేజ సజ్జా కూడా నేను రావడానికి మరో కారణమని చిరంజీవి అన్నారు. ట్రైలర్‌, టీజర్‌ చూసినప్పుడు ప్రతి సన్నివేశంలో ఫైన్‌నెస్‌ కనిపించిందన్నారు. ట్రైలర్ చూసిన వెంటనే ‘ఎవరీ డైరెక్టర్‌’ అని అడిగి మరీ తెలుసుకున్నానని చిరంజీవి తెలిపారు.


నేను కొలిచే హనుమంతుడి గురించి బయట ఎక్కడా చెప్పుకోనని చిరంజీవి తెలిపారు. కానీ ఆయనను పూజిస్తూ క్రమశిక్షణతో, నిబద్ధతతో ఈ స్థాయికి వచ్చానన్నారు. ఇలాంటి వేదికపై హనుమాన్‌ గురించి కచ్చితంగా చెప్పాలన్నారు. అందుకే ఈ ఈవెంట్‌కు రమ్మని కోరగానే మరో ఆలోచన లేకుండా వచ్చేశానని చిరంజీవి అన్నారు. హనుమంతుడుని ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. మా ఇంట్లో భక్తులెవరూ లేరని, మా నాన్న కమ్యూనిస్ట్‌ అని చిరంజీవి తెలిపారు. అమ్మ కోరిక మేరకు ఎప్పుడైనా తిరుపతి వెళ్లేవారని తెలిపారు. అలాంటిది తాను ఏడో తరగతి చదువుతుండగా, పొన్నూరులో ఆంజనేయస్వామి గుడికి వెళ్లి నమస్కారం చేసుకుని వచ్చేవాడినని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.

తనకు ఒకసారి లాటరీలోనూ ఆంజనేయ స్వామి ఫొటో వచ్చిందని చిరంజీవి తెలిపారు. దాన్ని ఇప్పటికీ ఫ్రేమ్‌ కట్టి పూజిస్తున్నానని అన్నారు. హనుమాన్‌ను పూజించడం వల్ల నాన్న కోరుకున్న చోటుకి ట్రాన్స్‌ఫర్‌ అవడంతో ఆయన కూడా భక్తుడిగా మారిపోయారని చిరంజీవి తెలిపారు.

భగవంతుడు బాహ్యంగా ఉండడు మన అంతరాత్మలో ఉంటాడని చిరంజీవి అన్నారు. హనుమాన్‌ మనకు ఆశీస్సులు ఇవ్వడం మొదలు పెడితే జీవితాంతం వదలడన్నారు. మనల్ని నిరంతరం కాపాడుతూ, మార్గనిర్దేశం చేసే గొప్ప దేవుడని చిరంజీవి కొనియాడారు. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని జోస్యం చెప్పారు. ప్రశాంత్‌ వర్మ ఆలోచనలు, హీరో తేజ కష్టం వృథాపోవన్నారు.

‘హను-మాన్‌’ మూవీ గురించి గెటప్‌ శ్రీను మొదటిసారి తనకు చెప్పాడని చిరంజీవి గుర్తు చేశారు. ఇది సినిమాలకు పరీక్షాకాలమన్నారు. వరుస సినిమాలు ఉన్నప్పుడు ఎక్కువ థియేటర్‌లు దొరకకపోవచ్చుని తెలిపారు. సినీ ప్రేక్షకులు సినిమాలను ఇవాళ కాకపోతే రేపు చూస్తారన్నారు. ఫస్ట్‌ షో కాకపోతే, సెకండ్‌ షో అయినా చూడడానికి ఇష్టపడతారని తెలిపారు. సినిమాలో కంటెంట్‌ బాగుంటే, ప్రేక్షకుల మార్కులు బాగా పడతాయని చిరంజీవి తెలిపారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా చిత్ర బృందం అధైర్యపడొద్దు అని చిరంజీవి ధైర్యం నింపారు. అయోధ్య రామమందిరానికి సినీబృందం చేస్తున్న సాయం అభినందనీయం అని చిరంజీవి కొనియాడారు.

దర్శకుడు ప్రశాంత్‌ వర్మ మాట్లాడుతూ.. సినిమా అనేది ఒక యుద్ధంలాంటిదన్నారు. అవకాశం రావడం ఒకెత్తయితే, మూవీ తీయడం ఇంకో ఎత్తు అన్నారు. చివరిగా రిలీజ్‌ చేయడం పెద్ద యుద్ధంతో సమానమన్నారు. ” ధర్మం కోసం నిలబడిన ప్రతి ఒక్కరి వెనుక హనుమంతుడు ఉంటాడు ” అని మా సినిమాలో ఒక డైలాగ్‌ ఉందని ఆయన తెలిపారు.

Tags

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×