BigTV English

Rarest Blood Group | అరుదైన బ్లడ్ గ్రూపు ఇదే.. ప్రపంచంలో 9 మంది మాత్రమే రక్తదానానికి అర్హులు!

Rarest Blood Group | ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూపు గురించి మీకు తెలుసా?.. ఆ బ్లడ్ గ్రూపు ఉన్నవాళ్లకు ఏదైనా ప్రమాదం జరిగి రక్తం అవసరమైతే దొరికే పరిస్థితి దాదాపు లేనట్లే. ఎందుకంటే ఆ అరుదైన బ్లడ్ గ్రూపు ఉన్నవారిలో ప్రపంచం మొత్తం మీద 9 మంది మాత్రమే ఉన్నారు.

Rarest Blood Group | అరుదైన బ్లడ్ గ్రూపు ఇదే.. ప్రపంచంలో 9 మంది మాత్రమే రక్తదానానికి అర్హులు!

Rarest Blood Group | ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూపు గురించి మీకు తెలుసా?.. ఆ బ్లడ్ గ్రూపు ఉన్నవాళ్లకు ఏదైనా ప్రమాదం జరిగి రక్తం అవసరమైతే దొరికే పరిస్థితి దాదాపు లేనట్లే. ఎందుకంటే ఆ అరుదైన బ్లడ్ గ్రూపు ఉన్నవారిలో ప్రపంచం మొత్తం మీద 9 మంది మాత్రమే ఉన్నారు.


అసలు ఆ అరుదైన బ్లడ్ గ్రూపు ఉన్నవారిని ఎలా గుర్తించాలి?.. ఆ బ్లడ్ గ్రూపు కారకం ఏంటి? అనే అంశాల గురించి తెలుసుకుందాం.

బ్లడ్ గ్రూపులో ఎన్ని రకాలు? అని ఎవరైనా అడిగితే.. టక్కున A+, A-, B+, B-, O+, O-, AB+, AB- అని చెప్పేస్తాం. అయితే.. వీటితో బాటు మరో రెండు బ్లడ్ గ్రూపులున్నాయని మనలో చాలామందికి తెలియదు. ఆ అరుదైన బ్లడ్ గ్రూపులు ఏమిటి? ఆ రెండింటిలో అత్యంత అరుదైన బ్లడ్ గ్రూపు ఏదో తెలుసుకుందాం.


మొత్తం ప్రపంచంలో అత్యంత అరుదైన బ్లడ్ గ్రూపులు.. ఒకటి.. ముంబయి నగరంలో గుర్తించిన బాంబే బ్లడ్ గ్రూప్ కాగా.. రెండవది.. ఆస్ట్రేలియాలో గుర్తించిన గోల్డెన్ బ్లడ్ గ్రూప్. వీటిలో బాంబే బ్లడ్ గ్రూప్ అనేది 10 వేల మందిలో ఒకరికి మాత్రమే ఉంటుంది. అయితే.. రెండవదైన గోల్డెన్ బ్లడ్ గ్రూపు (Golden Blood Group) కలిగిన వ్యక్తులు ప్రపంచం మొత్తం మీద కేవలం 100 మంది మాత్రమే ఉంటారని అంచనా.

ఈ గోల్డెన్ బ్లడ్ గ్రూపును 1961లో తొలిసారిగా ఆస్ట్రేలియాకు చెందిన మహిళలో గుర్తించారు. నాటి నుంచి నేటి వరకు ఈ గ్రూపు కేవలం 45 మందిలోనే బయటపడగా, వీరిలో కేవలం 9 మంది మాత్రమే రక్తదానం చేయగలుగుతున్నారు. జపాన్, కొలంబియా, బ్రెజిల్, అమెరికా, ఐర్లాండ్ దేశాల పౌరుల్లో ఈ గ్రూపు బయటపడింది.

నిజానికి, Rh కారకం అనేది ఎర్ర రక్త కణాల ఉపరితలంపై కనిపించే ఒక ప్రత్యేక రకం ప్రోటీన్. ఈ ప్రొటీన్ RBCలో ఉంటే వారి రక్తం Rh+ పాజిటివ్‌గా, ఆ ప్రోటీన్ లేకపోతే ఆ రక్తం Rh-నెగటివ్‌గా గుర్తిస్తారు. అయితే.. ఈ గోల్డెన్ బ్లడ్ గ్రూపు వారిలో, Rh null (శూన్యం) ఉంటుంది. అదే దీని ప్రత్యేకత. అందుకే ఈ రక్తం ఎవరికైనా ఇచ్చేందుకు పనికొస్తుంది. కానీ.. ఈ గ్రూపు ఉన్న వ్యక్తులకు ఎప్పుడైనా రక్తం అవసరమమైతే.. ఖచ్చింతంగా ఇదే గ్రూపు రక్తం ఎక్కించాలి తప్ప మరే ఇతర గ్రూపు బ్లడ్ పనికిరాదు.

అత్యంత తక్కువ మందికే ఉన్న ఈ గ్రూపు అరుదైనది కావటంతో ఈ బ్లడ్ గ్రూప్ వ్యక్తులు ఏదైనా ప్రమాదం బారినపడితే.. అదే రక్తం ఉన్న దాతలు దొరకటం కష్టం. అలాగే.. ఇప్పటివరకు ఈ గ్రూపు రక్తాన్ని నిల్వ చేసే ప్రత్యేక కేంద్రాలు కూడా అందుబాటులో లేవు. ఈ రక్తంపై పరిశోధనలు జరిపేందుకు నమూనాల కోసం కొందరు శాస్త్రవేత్తలు వెతికినా నేటికీ లాభం లేకపోయింది.

Related News

Telangana Politics: మరోసారి హాట్ టాపిక్‌గా మారిన కొండా ఫ్యామిలీ

Gaza conflict: హమాస్ VS ఇజ్రాయెల్.. గాజాలో శాంతి నెలకొంటుందా?

AI assistant: AI యుగం వచ్చినా.. అమ్మాయిలపై వేధింపులు ఆగవా..

BJP: బీజేపీపై కొండ సెటైర్లు.. ఫ్లవర్ కాదు ఫైర్

Telangana Politics: రాజకీయాలకు దూరంగా జగ్గారెడ్డి.. అసలు ఏమైంది..!

AP Fake Liquor Case: ఏపీ కల్తీ మద్యం స్కామ్.. వెనుకుంది వాళ్లేనా..

AP Politics: అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుపై చంద్రబాబు వార్నింగ్..

AP Politics: జగన్ నర్సీపట్నం టూర్.. అసలు ప్లాన్ ఇదేనా..?

Big Stories

×