Chiranjeevi: విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా తెరకెక్కిన ‘లైలా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌లాగా హాజరయ్యారు. అయితే మామూలుగా విశ్వక్ సేన్.. బాలకృష్ణ లేదా ఎన్‌టీఆర్‌ను తన సినిమాకు సపోర్ట్ చేయమని అడుగుతాడు. కానీ మొదటిసారి చిరంజీవిని సపోర్ట్‌గా తెచ్చుకున్నాడు విశ్వక్. దాని వల్ల తనపై నెగిటివ్ కామెంట్స్ కూడా రావడంతో సినిమా ఇండస్ట్రీకి కాంపౌండ్ అనేది లేదు అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్‌మెంట్ చిరంజీవిని బాగా ఆకట్టుకుంది. అదే విషయాన్ని తన స్పీచ్‌లో కూడా తెలిపారు. హీరోల్లో ఎవరు గొప్ప అంటూ ఇండస్ట్రీలో జరుగుతున్న వివాదాలకు తన స్పీచ్‌తో చెక్ పెట్టారు చిరంజీవి.
కాంపౌండ్ లేదు
‘‘లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్తున్నాను అనగానే విశ్వక్ సేన్ ఫంక్షన్‌కు వెళ్తున్నావా? అని అడిగారు. ఏం ఎందుకు వెళ్ళకూడదు? అతను మన మనిషి కాదు.. బాలకృష్ణ.. అప్పుడప్పుడు తారక్ అంటాడు. అంటే మనుషులంటే వేరే వాళ్ళ మీద అభిమానం ప్రేమ ఉండకూడదా? మా ఇంట్లోనే మా అబ్బాయికి సూర్య అంటే చాలా ఇష్టం. అలా అని వాడి ఫంక్షన్‌కు నేను వెళ్ళకూడదా? విశ్వక్‌ను కూడా ఇలాగే అడిగితే మా ఇంటికి కాంపౌండ్ ఉంటుంది కానీ సినిమా ఇండస్ట్రీకి కాంపౌండ్ లేదు అన్నాడు. అభిమానులు పోస్టర్లు చింపుకోవడం నేను చూశాను. నా కజిన్సే ఒకరు ఎన్‌టీఆర్ అని, మరొకరు ఏఎన్ఆర్ అని రక్తాలు వచ్చేలా కొట్టుకున్నారు’’ అంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలోని విభేదాల గురించి చెప్పుకొచ్చారు చిరంజీవి.
కలిసికట్టుగా ఉంటాం
‘‘హీరోలు బాగానే ఉంటారు. అభిమానులు కొట్టుకుంటున్నారనే ఆలోచన ఆరోజు నుండే నాకు మొదలయ్యింది. నేను ఫిల్మ్ యాక్టర్ అయినప్పటి నుండి యాక్టర్లు అందరి మధ్య మంచి అనుబంధం ఏర్పరచాలని అనుకున్నాను. ఈరోజుకి బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున మేమంతా కలిసికట్టుగా ఉంటాం. బాలయ్య 50 ఇయర్స్ వేడుకకు నేను వెళ్లాను. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు. పుష్ప 2 పెద్ద హిట్ అయ్యింది. దానికి నేను గర్విస్తాను. ఇండస్ట్రీలో ఒక సినిమా ఆడింది అంటే అందరం ఆనందపడాలి. లైలా గెటప్‌లో విశ్వక్ కసక్‌లాగా అనిపిస్తున్నాడు. విశ్వక్ నిజంగా ఆడపిల్ల అయ్యింటే గుండెజారి గల్లంతయ్యేది. అంత గ్లామర్‌గా ఉన్నాడు. నేను, నరేష్, రాజేంద్ర ప్రసాద్ లేడి గెటప్స్ వేశాం. ఆ సినిమాలన్నీ హిట్ అయ్యాయి. లైలా కూడా హిట్ గ్యారెంటీ’’ అని నమ్మకం వ్యక్తం చేశారు చిరంజీవి (Chiranjeevi).
Also Read: ఆ గొడవల్లో మా కారు కాల్చేశారు, నా ఇద్దరు ఫ్రెండ్స్ చనిపోయారు.. ‘లైలా’ ప్రీ రిలీజ్‌లో విశ్వక్ సేన్
జెండా పాతాలి
‘‘తప్పకుండా లైలా (Laila) సినిమాను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్. విశ్వక్ చాలా టాలెంటెడ్. తను ఇండస్ట్రీలో జెండా పాతాలి. ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాతో మగవాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకుంటాడు. అందరికీ ఆల్ ది బెస్ట్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నేను ఒక సినిమా చేయబోతున్నాను. సినిమా సమ్మర్‌లో ప్రారంభం కాబోతోంది. ఇది ఫుల్ కామెడీ మూవీ. ఎప్పుడెప్పుడు షూటింగ్ ప్రారంభిస్తామా అని ఆసక్తిగా ఉంది’’ అంటూ తన స్పీచ్ ముగించారు చిరంజీవి. మొత్తానికి చిరంజీవి వచ్చి ‘లైలా’ మేకర్స్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పడంతో మూవీ టీమ్‌లో నమ్మకం మరింత పెరిగింది.