Vishwak Sen: ఎప్పుడూ యూత్‌ఫుల్ సినిమాలతోనే ప్రేక్షకులకు దగ్గరయ్యాడు విశ్వక్ సేన్ (Vishwak Sen). కమర్షియల్ సినిమాలకు ఎక్కువగా దూరంగా ఉంటూ యూత్‌ను ఇంప్రెస్ చేయడంపైనే ఫోకస్ చేస్తుంటాడు ఈ హీరో. అలాంటిది మొదటిసారి తన కంఫర్ట్ జోన్ నుండి బయటికి వచ్చి ‘లైలా’ (Laila) అనే సినిమా చేశాడు. అందులో పూర్తిస్థాయిగా లేడీ గెటప్‌లో కనిపించి అందరికీ షాకిచ్చాడు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు మేకర్స్. ఆ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి చీఫ్ గెస్టలుగా హాజరయ్యారు. అందులో విశ్వక్ సేన్ స్పీచ్ చాలామందిని ఇంప్రెస్ చేసింది. తన మూవీని ప్రమోట్ చేయడం కోసం రియల్ లైఫ్ సంఘటనలను ఉదాహరణగా తీసుకున్నాడు విశ్వక్.
చిరంజీవి నుండి ఫోన్
‘‘లైలా ట్రైలర్ చూడగానే చిరంజీవిగారి కళ్లలో ఒక ఆనందం చూశాను. అదే నా మొదటి అవార్డ్. సరదాగా ఒక పెద్ద జ్ఞాపకం చెప్తాను. మా నాన్న చిరంజీవికి వీరాభిమాని. రాజకీయాల్లో చిరంజీవి ఫాలోవర్స్‌గా గొడవల వల్ల మా ఇంటి వెనుక ఉన్న కారు కాల్చేశారు. ఇంట్లో అందరం భయపడుతూ ఉన్నాం. అప్పుడే నాన్నకు ఒక కాల్ వస్తే నేను లిఫ్ట్ చేశాను. నేను చిరంజీవి అనగానే షేక్ అయిపోయాను. మా కారు కాలిపోయి మంచి పని అయ్యింది అనుకున్నాం. చిరంజీవి నుండి డైరెక్ట్ ఫోన్ కాల్ వచ్చిందనే సంతోషంలో ఉండిపోయాం. మొదట్లో మేము దిల్‌సుఖ్‌నగర్‌లో ఉండేవాళ్లం. అక్కడి నుండి సినిమాల్లోకి రావడం చాలా కష్టమనిపించేది’’ అని చెప్పుకొచ్చాడు విశ్వక్ సేన్.
వాడే ధనవంతుడు
‘‘నా ఫేవరెట్ సినిమా ఆపద్భాంధవుడు. నేను యాక్టర్ అవ్వడానికి అది ఇన్‌స్పిరేషన్. మా డైరెక్టర్ లైలా కథతో చాలామందిని అప్రోచ్ అయినా ఎవరూ ఒప్పుకోలేదు. విశ్వక్‌కు వెళ్లి చెప్పమని ఎవరో సలహా ఇచ్చినా అతను అస్సలు చేయడు అన్నారంట. కానీ నా కష్టం వృధా కాని కథ ఇది. ఏదో ఒకరోజు ఎఫ్ 7, ఎఫ్ 8 చేస్తావేమో అని, అదే జరిగితే నేను చాలా హ్యాపీ. ఎంటర్‌టైన్మెంట్ గురించి రెండు మాటలు మాట్లాడాలని అనుకుంటున్నాను. నా ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఇద్దరు చనిపోయారు. ఎందుకని ఆలోచిస్తే అందరికీ ఒత్తిడి ఎక్కువయపోయింది. మానసికంగా ప్రశాంతంగా ఉన్నవాడే అందరికంటే ధనవంతుడు. అసలు ఈరోజుల్లో పరిచయం లేని వ్యక్తులతో ద్వేషం పెంచుకుంటున్నాం’’ అన్నాడు విశ్వక్.
Also Read: ‘పుష్ప 2’ సక్సెస్ మీట్‌కు రాకపోవడానికి కారణం అదే.. క్లారిటీ ఇచ్చిన రష్మిక
ద్వేషం వద్దు
‘‘ప్రతీ ఒకరి జీవితంలో ఏదో ఒక పోరాటం ఉంది. అలాంటప్పుడు వారిపై ద్వేషం చూపించి వారు బాధపడడానికి మనం కారణం కావొద్దు. మన జోలికి వస్తే ఫైట్ చేద్దాం. కానీ పక్కనోడికి సాయం చేస్తే ప్రపంచం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీకు ఉన్న ఒత్తిడిని మర్చిపోవడానికి మా ప్రయత్నం మేము చేశాం’’ అంటూ ‘లైలా’ను తప్పకుండా థియేటర్లలో చూడమని కోరాడు విశ్వక్ సేన్. రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదలకు సిద్ధమయ్యింది. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలయిన టీజర్, ట్రైలర్, బిహైండ్ ది సీన్స్ అన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.