Chiranjeevi: స్టార్ హీరోలు లేడీ గెటప్స్ వేయాలనుకుంటే చాలా ధైర్యం కావాలి. ఆడియన్స్ అంతా ఎలా రియాక్ట్ అవుతారో, ఫ్యాన్స్ అంతా ఎలా రియాక్ట్ అవుతారో అనే ఆలోచన వారి మైండ్‌లో ఉండకూడదు. కానీ అలా ఏ ఆలోచన లేకుండా లేడీ గెటప్‌తో ప్రయోగాలు చేసినవారు చాలా తక్కువమంది ఉన్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఒకప్పుడు ‘చంటబ్బాయి’ సినిమాలో ఒక సీన్‌లో లేడీ గెటప్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు చిరు. ఇప్పుడు ఆయననే ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని విశ్వక్ సేన్ కూడా ‘లైలా’లో లేడీ గెటప్‌లో కనిపించనున్నాడు. ‘లైలా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న చిరుకు లేడీ గెటప్‌కు సంబంధించిన ప్రశ్న ఎదురయ్యింది.
నన్ను దాటిపోయావు
‘లైలా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు చిరంజీవి. అక్కడ ఆయనకు ఒక సర్‌ప్రైజ్ ఉంటూ అంటూ స్క్రీన్‌పై ఒక ఫోటోను చూపించాడు విశ్వక్ సేన్. ‘చంటబ్బాయి’ సినిమాలో లేడీ గెటప్‌ను చూపిస్తూ అసలు ఆ పాత్ర చేసినప్పుడు ఆయన ఎలా ఫీల్ అయ్యారో చెప్పమని కోరాడు. దీంతో అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు చిరు. ‘చంటబ్బాయి’లో తన లేడీ గెటప్ కంటే ‘లైలా’లో విశ్వక్ లేడీ గెటపే బాగుందని కామెంట్ చేశారు. అంతే కాకుండా నన్ను దాటిపోయావు అంటూ ప్రశంసించారు. దీంతో విశ్వక్ సేన్ తన కష్టానికి ఫలితం దక్కిందని చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. ఇక ‘చంటబ్బాయి’ షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఫన్నీ సంఘటనను గుర్తుచేసుకున్నారు చిరు.
అలాంటి కండీషన్
‘చంటబ్బాయి’ సినిమాలో లేడీ గెటప్‌లో కనిపించడం కోసం చిరంజీవి (Chiranjeevi)ని మీసాలు తీసేయమని అడిగారట దర్శకుడు జంధ్యాల. అయితే అప్పటికి సెట్‌లో 60, 70 మంది టెక్నీషియన్స్ ఉన్నారట. వారందరూ కూడా మీసాలు తీసేస్తేనే తాను కూడా తీసేస్తానని మొండిపట్టు పట్టారట చిరు. దీంతో వేరే దారిలేక సెట్‌లో ఉన్న అందరి మీసాలు తీయించేశారట దర్శకుడు. అలా ‘చంటబ్బాయి’ సినిమాలో లేడీ గెటప్ వెనుక ఇంత కథ ఉందని రివీల్ చేశారు చిరు. అంతే కాకుండా ‘లైలా’లో లైలా గెటప్‌లో విశ్వక్ సేన్ కూడా అదే రేంజ్‌లో ఆకట్టకుంటాడని నమ్మకం వ్యక్తం చేశారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యి అందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు.
Also Read: ఆ గొడవల్లో మా కారు కాల్చేశారు, నా ఇద్దరు ఫ్రెండ్స్ చనిపోయారు.. ‘లైలా’ ప్రీ రిలీజ్‌లో విశ్వక్ సేన్
విశ్వక్ ప్రయోగం
విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే ‘లైలా’ (Laila). ఇప్పటివరకు ఎక్కువగా యూత్‌ఫుల్ సినిమాలతో యూత్‌కు దగ్గరయిన విశ్వక్.. మొదటిసారి తన కంఫర్ట్ జోన్ నుండి బయటికి వచ్చి ఒక కొత్త ప్రయోగం చేశాడు. తాను అబ్బాయి అనే విషయం మర్చిపోయేలా లైలా అనే లేడీ గెటప్‌తో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు. లైలా కోసం తాను ఎంత కష్టపడ్డాడో ఒక వీడియోలో చూపించాడు. దీంతో విశ్వక్ సేన్‌పై, తన సినిమాపై అందరిలో ఒక పాజిటివ్ అభిప్రాయం ఏర్పడింది. ఫిబ్రవరి 14న ఈ మూవీ థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది. సింగిల్‌గా థియేటర్లకు వచ్చేవారికి లైలానే వాలెంటైన్ అంటూ ఆటపట్టించాడు విశ్వక్ సేన్.