E-Paper
Advertisement

Chiranjeevi: మెగాస్టార్ బర్త్ డే.. శ్రీవారి సేవలో చిరు ఫ్యామిలీ..

Chiranjeevi: మెగాస్టార్ బర్త్ డే..  శ్రీవారి సేవలో చిరు ఫ్యామిలీ..
Advertisement

Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 69వ పుట్టినరోజు (ఆగష్టు 22) నేడు. ఈ సందర్భంగా సతీ సమేతంగా తిరుమల విచ్చేశారు. గురువారం ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నారు చిరంజీవి కుటుంబసభ్యులు. దర్శనం తర్వాత చిరంజీవి దంపతులకు పండితులు ఆశీర్వాదం ఇచ్చారు.

టాలీవుడ్ సీనియర్ హీరో చిరంజీవి దంపతులు బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. గురువారం ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్నన్నారు. చిరు ఫ్యామిలీకి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. స్వామి దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదం ఇచ్చి ప్రసాదాలను అందజేశారు.

Advertisement

చిరంజీవి బర్త్ డే అంటే చెప్పనక్కర్లేదు. కొందరేమో మెగాస్టార్ అని.. మరికొందరు సుప్రీం అని ముద్దుగా పిలిచుకుంటారు అభిమానులు. 69వ పుట్టినరోజు జరుపు కున్న చిరంజీవి, ఇంకా యంగ్‌గానే ఉన్నాడని అంటున్నారు. 1955 ఆగష్టు 22న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో పుట్టాడు.

ALSO READ: అక్కినేని వారి ఇంట్లో పెళ్లి త్వరలోనే.. నాగచైతన్య వివాహం ఎప్పుడు, ఎక్కడో తెలుసా?

Advertisement

1978లో పునాదిరాళ్లు చిత్రంతో టాలీవుడ్‌లో పునాది వేసుకున్నాడు. ఏ ముహుర్తాన చిత్ర సీమలోకి అడుగుపెట్టాడోగానీ వెనుదిరిగి చూడలేదు. 1980 దశకంలో ఏడాది 12 సినిమాలకు పైగా చేసుకుంటూ వచ్చాడు. ఎన్టీఆర్, నాగేశ్వరరావు ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. చిరంజీవి సినిమాలంటే డ్యాన్స్‌లు, ఫైటర్లు, డైలాగ్స్‌లకు యువకులు థియేటర్లకు పరుగులు తీసేవారు.

Chiranjeevi's 69th Birthday
Chiranjeevi’s 69th Birthday

1990 దశకం వచ్చేసరికి సినిమాలు తగ్గినా ఈ హీరో క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సొసైటీలో జరిగే యదార్థ ఘటనల ఆధారంగా చిత్రాలు చేశాడు.. సక్సెస్ అయ్యాడు కూడా. ఈ కోవలోకి వచ్చినవే గ్యాంగ్ లీడర్, ఘరానా మెగుడు, బిగ్ బాస్, హిట్లర్, స్నేహం కోసం వంటి సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టాయి.

2020 దశకం వచ్చేసరికి ఏడాదికి ఒకటి లేదా రెండు మాత్రమే చేస్తున్నాడు. 69 ఏళ్లు వచ్చినా, అభిమానుల ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు. ఏపీ, తెలంగాణలోనే కాదు వివిధ రాష్ట్రాల్లో సైతం అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం విశ్వంభర ప్రాజెక్టు చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి.  వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు మేకర్స్.

 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×